India vs South Africa: టాస్ వేయకుండానే..నాలుగో టీ20 రద్దు..

భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరుగుతున్న టీ20 సీరీస్ లో భాగంగా ఈరోజు జరగాల్సిన నాలుగో టీ20 రద్దయింది. పొగమంచు ప్రభావం అధికంగా ఉండడంతో టాస్ కూడా వేయకుండానే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

New Update
India vs South Africa

భారత్, సౌతాఫ్రికా మధ్య లఖ్‌నవూ వేదికగా జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్‌ రద్దయింది. ఎకానా స్టేడియం పరిసర ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉండటంతో కనీసం టాస్ వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫెడ్యూల్ ప్రకారం టాస్ ను సాయంత్రం 6.30 గంటలకు వేయాలి. కానీ ఇక్కడ పొగ మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దాంతో పాటూ లక్నోలో AQI కూడా అతి ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఈరోజు 391గా నమోదైంది. ఈ రెండు కారణాల వలన అస్సలు విజిబిలిటీ లేదు. 

2-1తో ఆధిక్యంలో భారత్..

పొగమంచు ప్రభావం తగ్గుతుందేమో అని రాత్రి 9.30 గంటల వరకు వెయిట్ చేశారు. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సీరీస్ లో చివరి మ్యాచు శుక్రవారం అహ్మదాబాద్ లో జరగనుంది. ఇప్పటికే భారత్ ఈ సీరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే 3-1తో సీరీస్ విన్నర్ గా నిలుస్తుంది. ఒకవేళ గెలవకపోయినా 2-2తో సీరీస్ సమం చేస్తుంది. 

Advertisment
తాజా కథనాలు