Asia Cup: అండర్ 19 ఆసియా కప్ పాకిస్తాన్ దే..తేలిపోయిన టీమ్ ఇండియా

అండర్ 19 ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. 191 పరుగులు తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడింది.

New Update
pakistan -19

మొత్తం టోర్నీ అంతా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆడి చివర్లో మాత్రం భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిపోయింది అండర్ 19 టీమ్ ఇండియా. మరోవైపు పాకిస్తాన్ కుర్రాళ్ళు రెచ్చిపోయారు. దీని ఫలితంగా దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓడిపోయింది. 248 పరుగుల టార్గెట్‌తో ఛేదనకు దిగిన టీమిండియా.. 191 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ పాక్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. 2013లో భారత్‌తో జాయింట్ విన్నర్స్‌గా నిలిచిన పాక్.. ఇప్పుడు మరోసారి అండర్-19 ఆసియా కప్ కైవసం చేసుకుంది.

తేలిపోయిన బ్యాటర్లు..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ప్రారంభంలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (26), ఆయుష్మాత్రే (2) తేలిపోయారు. మూడో ఓవర్‌లోనే భారీ షాట్ ఆడిన మాత్రే.. ఫర్హాన్‌కు అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడుతూ వచ్చాయి. 59 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత కూడా భారత బ్యాటర్లు కోలుకోలేని దెబ్బ తీశారు పాక్ బౌలర్లు. పాకిస్థాన్ బౌలర్లలో అలి రజా నాలుగు వికెట్లు తీశాడు. మహ్మద్ సయ్యమ్, అబ్ధుల్ సుభాన్, హుజాఇఫాఅహ్సాన్తలో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో టీమ్ ఇండియా అస్సలు పరుగులు రాబట్టలేకపోయింది.

రెచ్చిపోయిన సమీర్ మిన్హాస్..

అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్ లోనే పాకిస్తాన్ భారత్ ను దెబ్బ తీసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ముఖ్యంగా సమీర్ మిన్హాస్ ను ఆపడం భారత బౌలర్లకు సాధ్యం కాలేదు. దీంతో అతను 172 పరుగులతో భారీ శతకం సాధించాడు. ఇతడినికట్టిడి చేయడానికి భారత బౌలర్లు నానా తంటాలు పడ్డారు. దీపేశ్‌ వేసిన 43వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ బాదిన సమీర్.. ఐదో బంతికి భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. దీంతో కాన్షిక్ చౌహాన్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు. మిగతా వాళ్ళందరూ తక్కువ స్కోర్లే చేసినా సమీర్ కు అండగా నిలిచి భారీ స్కోరు వచ్చేలా తోడ్పడ్డారు.

Advertisment
తాజా కథనాలు