/rtv/media/media_files/2025/06/16/wi5bXMU2G4TkrsD5y0a1.jpg)
Rapido, Uber, Ola pause bike taxi operations in Karnataka following HC order
కర్ణాటకలో బైక్ ట్యాక్సి సేవలు నిలిచిపోయాయి. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలు ఆపేశాయి. హైకోర్టు ఆదేశాలను పాటించి తమ బైక్ ట్సాక్సి సేవలు నిలిపివేసినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. త్వరలోనే సేవలను మళ్లీ ప్రారంభించేదుకు ప్రభుత్వంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నాయి.
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
సోమవారం నుంచి బైక్ ట్యాక్సి సేవలు ఆపేయాలని ఆదేశించిన హైకోర్టు.. జూన్ 20 లోగా ఈ విషయంపై తమ స్పందన తెలియజేయాలని కర్ణాటక సర్కార్‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. తర్వాతి విచారణను జూన్ 24కు వాయిదా వేసింది. బైక్ ట్యాక్సీలు సేవలు నిలిచిపోవడంతో వీటిపై ఆధారపడ్డ గిగ్‌వర్కర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వల్ల తమ జీవితాలు రోడ్డున పడతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలోనే 'నమ్మ బైక్ ట్యాక్సీ అసోసియేషన్'.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖలు రాసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలాఉండగా.. ఉబర్ బైక్ ట్యాక్సి సేవలను మోటో కొరియర్ కింద మార్చింది. ఓలా తన యాప్‌లో బైక్ ట్యాక్సీ అనే ఆప్షన్‌ను తొలగించింది. మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం బైక్ ట్యాక్సి ప్రస్తావన లేకపోవడంతోనే ఆ సేవలు నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే బైక్ ట్యాక్సీ కంపెనీలు దీన్ని సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ చేశారు. దీంతో డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలు సమర్థించింది.
Also read: ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం.. నెక్స్ట్ పాకిస్థాన్‌పై దాడులు !
Also read: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!
Follow Us