Bike Taxi: గిగ్ వర్కర్లకు షాక్.. ఆ రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలు బంద్
కర్ణాటకలో బైక్ ట్యాక్సి సేవలు నిలిచిపోయాయి. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలు ఆపేశాయి.
కర్ణాటకలో బైక్ ట్యాక్సి సేవలు నిలిచిపోయాయి. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలు ఆపేశాయి.
బెంగళూరులో జయనగర్‌లో రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ ఓ మహిళాపై దాడి చేశాడు. ఈ సంఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ర్యాష్ డ్రైవింగ్‌పై ప్రశ్నించడంతో వాగ్వాదం ప్రారంభమైందనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ టాక్సీల వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రానున్న 6 వారాల్లో వీటిని నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి సరైన నిబంధనలు లేకుండా ఈ సేవలను కొనసాగించొద్దని, వీటికి సరైన చట్టం అవసరమని జస్టిస్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు.
రైడ్ హైయిరింగ్ కంపెనీల దోపిడీకి అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ తీసుకురానుంది. మరో కొన్ని నెలల్లో ఈ సర్వీసును ప్రారంభింస్తామని అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. వాహనదారులు ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో ఇక మీదట మహిళా డ్రైవర్లు రయ్ రయ్ మని తిరగనున్నారు. క్యాబ్ లు, బైక్ లు నడిపేందుకు హిళా డ్రైవర్లను నియమించనున్నారు. ఈ మేరకు ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
డ్రైవర్ల కోసం ఉబర్ కొత్త సర్వీస్ విధానాలను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఉబర్ క్రెడిట్ అకౌంట్లకు పేమెంట్స్ చేయగా.. ఇకపై డ్రైవర్లకు నగదు లేదా డిజిటల్ పేమెంట్స్ డైరెక్ట్‌గా చేయవచ్చని తెలిపింది. దీనివల్ల ప్రతీ రైడ్‌కి డ్రైవర్లు కమిషన్ చెల్లించక్కర్లేదు.
మీరు ఆటో, క్యాబ్ మరియు బైక్‌లను సులభంగా బుక్ చేసుకోగల బెస్ట్ యాప్‌లు ఇవే.. ఓలా క్యాబ్స్, ఉబెర్, రాపిడో బైక్ టాక్సీ, మెగా క్యాబ్స్, ఆన్ ది డ్రైవ్.
హైదరాబాద్ మహానగరంలో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా 'రాపిడో-ఈసీ' సంయుక్తంగా ఓటర్లకు ఫ్రీ ట్రాన్స్ పోర్ట్ సేవలను ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను పోలింగ్ బూత్ ల నుంచి వారి ఇంటికి ఉచితంగా చేర్చనుంది రాపిడో.