Uttarakhand Cloudburst: రాబోయే 24 గంటల్లో ఉత్తరకాశీలో భారీ వరదలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!

మరో 24 గంటల్లో మళ్లీ ఉత్తరకాశీలో భారీ వరదలు వస్తాయని అధికారులు హెచ్చరించారు. రుద్రప్రయాగ్, చమోలి, బాగేశ్వర్, పిథోరగఢ్, హరిద్వార్, నైనిటాల్, ఉధమ్ సింగ్ నగర్‌లో వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

New Update
Uttarkhand

Uttarkhand Photograph: (Twitter)

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామంపై క్లౌడ్ బరస్ట్ (Uttarakhand Cloudburst) విధ్వంసం సృష్టించింది. ఖీర్ గంగా విజృంభించడంతో ధరాలీ గ్రామం కొట్టుకునిపోయింది. దీంతో హోటళ్లు, ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయాయి. దాదాపుగా 25 హోటళ్లు, ఇళ్లు ధ్వంసం కాగా 100 మంది వరకు గల్లంతు అయ్యారు. ధరాలీ గ్రామంలో ఉన్న ఆర్మీ బేస్ క్యాంపు కూడా వరదలకు కొట్టుకునిపోయింది. దీంతో వెంటనే SDRF, NDRF బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. కానీ ఎక్కువగా ఆటంకాలు ఏర్పడంతో అధికారులు సహాయ చర్యలు కాస్త కష్టమయ్యాయి.

ఇది కూడా చూడండి: Weather Update: భారీ వర్షాలు.. ఈ 9 జిల్లాల్లో పాఠశాలలు క్లోజ్ - ప్రభుత్వ ఆదేశాలు జారీ

24 గంటల్లో భారీ వరదలు..

మరో 24 గంటల్లో మళ్లీ ఉత్తరకాశీలో భారీ వరదలు వస్తాయని అధికారులు హెచ్చరించారు. రుద్రప్రయాగ్, చమోలి, బాగేశ్వర్, పిథోరగఢ్, హరిద్వార్, నైనిటాల్, ఉధమ్ సింగ్ నగర్‌లో వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ధరాలిలో మేఘావృతం అయ్యిందని, మళ్లీ భారీ వరదలు వచ్చే ఛాన్స్ ఉందని అవసరం అయితే ఉత్తరకాశీ జిల్లా విపత్తు నియంత్రణ గది హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేయాలని తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్పకుండా 01374-222126, 01374-222722, 9456556431 నంబర్‌లకు సంప్రదించవచ్చని వెల్లడించారు.

ఇది కూడా చూడండి:  ఎలక్షన్ కమిషన్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశం

సహాయక చర్యలకు ఆటంకాలు..

ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ధరాలీ విపత్తు బాధిత కుటుంబాలను కలిశారు. ఈ వారికి అన్ని విధాలుగా సాయం చేస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. తమకు ఎల్లప్పుడు ప్రభుత్వం తోడుగా ఉంటుందని వెల్లడించారు.విపత్తు నిర్వహణ, సహాయ చర్యలు వేగంగా జరుగుతున్నాయి. తప్పిపోయిన ప్రతి ఒక్కరినీ కూడా వెతుకుతున్నారని తెలిపారు. ఎక్కడిక్కడా రవాణా నిలిచిపోవడంతో సహాయ చర్యలకు కాస్త ఇబ్బంది ఏర్పడితోంది. ఉత్తరకాశీలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో రవాణా ఆగిపోయింది. కొన్ని గ్రామాలకు ప్రస్తుతం పూర్తిగా రవాణా ఆగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం అవుతోందని తెలిపారు. త్వరలోన అందరినీ కాపాడతామని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు