UP Hathras: లవర్‌తో పానీపూరి తిన్న చెల్లి.. జుట్టుపట్టుకుని దారుణంగా కొట్టిన అన్నయ్య- షాకింగ్ వీడియో

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దారుణం జరిగింది. యువతి, ఆమె ప్రియుడు కలిసి ఛోలే-భటురే తింటుండగా, యువతి సోదరుడు చూసి దాడి చేశాడు. తన చెల్లి జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

New Update
UP Hathras

UP Hathras

ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh) లోని హత్రాస్(up-hathras) నగరంలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఓ యువతి తన ప్రియుడి (Lovers) తో కలిసి ఒక దుకాణం వద్ద ఛోలే-బటురే తింటుండగా.. ఆమె సోదరుడు వచ్చాడు. అక్కడ తన చెల్లితో పాటు ఉన్న యువకుడిని చూసి చిర్రెత్తిపోయాడు. ఆగ్రహంతో యువకుడిపై బహిరంగంగా దాడి చేశాడు. ఆపుతున్న తన చెల్లిని సైతం జుట్టు పట్టుకుని కొట్టాడు. హత్రాస్ నగరంలోని లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  28 మంది కేరళ టూరిస్టులు గల్లంతు

UP Hathras Viral Video

హత్రాస్ నగరంలోని లక్ష్మీ టాకీస్ ప్రాంతం బాగా ఫేమస్. అది చాలా రద్దీగా ఉండే ఏరియా. అక్కడ ఓ యువకుడు, యువతి కలిసి ఒక దుకాణం వద్ద మాట్లాడుకుంటూ ఛోలే-బటురే తింటున్నారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో.. బైక్‌పై అక్కడికి వచ్చిన యువతి సోదరుడు వారిని గమనించాడు. తన సోదరి ఒక యువకుడితో కలిసి సరదాగా మాట్లాడుకుని తింటుండటాన్ని చూసి అతడు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. 

దీంతో బైక్‌ దిగి నేరుగా ఆ యువకుడి దగ్గరకు వెళ్లి ‘‘నా చెల్లితో ఏం చేస్తున్నావు?’’ అని ప్రశ్నిస్తూ దుర్భాషలాడాడు. అదే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. యువతి తన సోదరుడిని కూల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. యువతి సోదరుడు ఆగకుండా యువకుడిపై దాడి చేశాడు. దీంతో పక్కనే ఉన్న స్థానికులు జోక్యం చేసుకుని గొడవను ఆపడానికి ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి మాత్రం తన కోపాన్ని అదుపు చేసుకోలేక.. వారిని కూడా పక్కకు నెట్టి యువకుడిపై దాడి కొనసాగించాడు.

దాడి చేస్తున్న సోదరుడిని ఆపడానికి యువతి ఎంతగా ప్రయత్నించినా.. అతడు తన చెల్లి మాటను కూడా లెక్కచేయలేదు. ఆఖరికి తన చెల్లెని కూడా అతి దారుణంగా కొట్టాడు. జుట్టు పట్టుకుని ఇటు అటు తిప్పి పిడిగుద్దులు గుద్దాడు. ఆ తర్వాత యువకుడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దాడిలో పాల్గొన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read :  వీడు తండ్రి కాదు రాక్షసుడు.. కన్న కూతురు ముందే ఏం చేశాడంటే..!!

ఈ దాడిని చూస్తున్న కొంతమంది స్థానికులు తమ ఫోన్‌లలో వీడియో తీశారు. కొద్దిసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది యువతి సోదరుడి చర్యను సమర్థిస్తున్నారు. ‘‘ఇలా బహిరంగంగా తిరిగితే కుటుంబ పరువు పోతుంది’’ అంటూ కామెంట్లు చేస్తు్న్నారు. మరికొందరు ఇలా బహిరంగంగా ఒకరిపై దాడి చేయడం చట్టవిరుద్ధమని, ఇది దారుణమని విమర్శిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు