SBI Recruitment: నెలకు రూ.60 వేల జీతంతో SBIలో క్లర్క్ ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఆ రోజే!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కేడర్‌లో 6589 జూనియర్ అసోసియేట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 5180 రెగ్యులర్ ఖాళీలు విడుదలయ్యాయి. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 26వ తేదీ వరకు వీటికి అప్లై చేసుకోవచ్చు.

New Update
SBI 2025 JOB notification

SBI 2025 JOB notification

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కేడర్‌లో 6589 జూనియర్ అసోసియేట్ పోస్టులకు (Clerk Posts) రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 5180 రెగ్యులర్ ఖాళీలు విడుదలయ్యాయి. రెగ్యులర్ ఖాళీల్లో అన్‌రిజర్వ్డ్ 2255, ఎస్సీ కేటగిరీకి 788, ఎస్టీ 450, ఓబీసీ 1179, ఈడబ్లూఎస్  508 కేటగిరీకి చెందినవి. వీటితో పాటు 1409 బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. అయితే వీటికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి (ఆగస్టు 6) ప్రారంభమవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు sbi.co.in వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆగస్టు 26 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన టైర్-1 పరీక్ష సెప్టెంబర్‌లో జరగ్గా, ప్రధాన పరీక్ష నవంబర్‌లో జరుగుతుంది.

ఈ సమయంలోనే గ్రాడ్యూయేషన్ పూర్తి చేస్తే..

ఈ జూనియర్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీలోగా డిగ్రీ పూర్తి అయి ఉంటనే అప్లై చేసుకోవాలి. వీటికి వయోపరిమితి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వరకు ఉంటుంది. అభ్యర్థులు 1997 ఏప్రిల్ 2వ తేదీ కంటే ముందు 2005 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత పుట్టిన తేదీ ఉంటే అనర్హులు. అయితే ఎస్టీ, ఎస్సీ వర్గాల వారికి ఐదేళ్ల వరకు వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ వారికి అయితే మూడేళ్ల వరకు వయస్సు సడలింపు ఇస్తారు.

ఇది కూడా చూడండి: Capgemini India Hiring: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. క్యాప్‌జెమినీ కంపెనీలో 45,000 జాబ్స్

సెప్టెంబర్‌లో ప్రిలిమ్స్ పరీక్ష

ప్రారంభ వేతనం రూ.26,730 ఇస్తారు. అయితే అనుభవం పెరిగే కొలది జీతం రూ.60 వేల వరకు వెళ్తుంది. వీటికి ఫస్ట్ ఆన్‌లైన్ పరీక్ష్ నిర్వహిస్తారు.  తర్వాత మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో తప్పు ఆన్షర్‌కు నాలుగో వంతు మార్కులు తగ్గిస్తారు. ఈ క్లర్క్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగ కేటగిరీలకు ఫీజు లేదు. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి రూ.750 ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఇది కూడా చూడండి:AP Constable Results 2025: AP కానిస్టేబుల్ ఫలితాలు 2025 రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి!

పరీక్షకు ఒక పది రోజులు ముందుగా..

సెప్టెంబర్‌లో పరీక్ష జరగడానికి ఒక వారం లేదా పది రోజుల ముందుగా అడ్మిట్ కార్డులు వస్తాయి. ఈ నోటిఫికేషన్ వస్తుందని ముందుగానే అంచనా వేసి కొందరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. బ్యాంకు నోటిఫికేషన్లు ప్రతీ ఏడాది వస్తూనే ఉంటాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా సమస్య వస్తే సందేహాల కోసం http://cgrs.ibps.in ను సంప్రదించవచ్చు. సందేహాలను ఇందులో నమోదు చేయవచ్చు.

Advertisment
తాజా కథనాలు