RAILONE APP: రైల్వే సూపర్‌ యాప్‌.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

భారతీయ రైల్వే ‘Railone app’ పేరుతో ఒక యాప్‌ను లాంచ్ చేసింది. దీనిద్వారా రిజర్వ్‌డ్/అన్‌రిజర్వ్‌డ్ టికెట్స్, ప్లాట్‌పార్మ్ టికెట్స్, ట్రైన్ ఎంక్వైరీ, PNR, ఫుడ్ డెలివరీ సహా మరెన్నో సేవలు పొందొచ్చు. ఇప్పుడు దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంటో తెలుసుకుందాం.

New Update
RAILONE APP how to User Registration Step by step

RAILONE APP how to User Registration Step by step

రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ‘Railone app’ యాప్‌ను లాంచ్ చేసింది. మొదట స్వరైల్‌ (SwaRail) పేరుతో ఈ యాప్‌ను టెస్ట్ చేసింది. తాజాగా దీన్ని Railone app పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రిజర్వ్‌డ్/ అన్ రిజర్వ్‌డ్ టికెట్స్, ప్లాట్ పార్మ్ టికెట్స్, ట్రైన్ ఎంక్వైరీ, PNR స్టేటస్, ఫుడ్ డెలివరీ సహా మరెన్నో సేవలు పొందొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా? అనేది తెలుసుకుందాం. 

Also Read :  పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు!

Also Read :  వల్లభనేని వంశీకి బెయిల్.. రేపే విడుదల!

RAILONE APP User Registration

మొదట ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి Railone appను డౌన్ లోడ్ చేసుకోవాలి. 

ఆ తర్వాత లోకేషన్‌ పర్మిషన్‌తో యాప్‌ను ఓపెన్ చేయాలి. 

Railone app ఇన్‌స్టాల్ అయిన తర్వాత లాగిన్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, గెస్ట్ అనే మూడు ఆప్షన్‌లు ఉంటాయి. 

ఆ తర్వాత న్యూ యూజర్ రిజిస్ట్రేషన్‌ క్లిక్ చేయాలి.

అప్పుడు రైల్ కనెక్ట్, యూటిఎస్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో ఇప్పటికే అకౌంట్స్ ఉంటే ఆ లాగిన్ వివరాలతో యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 

ఒకవేళ రైల్ కనెక్ట్, యూటిఎస్‌లో అకౌంట్స్ లేకపోతే పైన ఉన్న బాక్స్‌లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేయాలి. 

ఆ తర్వాత కనిపిస్తున్న స్క్రీన్‌లో ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, యూజర్ ఐడీ, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైనప్ అవ్వాలి. 

అనంతరం ఓటీపీ, ఎంపిన్ ఎంటర్ చేసి.. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. 

ఆ తర్వాత ప్రొఫైల్‌లోకి వెళ్లి ఫింగర్ ప్రింట్ లాగిన్ పెట్టుకోవచ్చు. 

Also Read :  ‘కాలేజీ టూర్‌లో రేప్ చేశాడు’.. కోల్‌కతా గ్యాంగ్‌రేప్ ప్రధాన నిందితుడిపై మరో యువతి ఫిర్యాదు!

Also Read :  కుమ్ముడే కుమ్ముడు..రూ.549కే VIVO 5జీ కొత్త స్మార్ట్‌ఫోన్!

indian-railway | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
తాజా కథనాలు