Residential Certificate Application: మొన్న కుక్కకి, నిన్న ట్రంప్‌కు, ఈరోజు పిల్లికి.. అసలు బిహార్‌లో ఏం జరుగుతోంది?

క్యాట్ కుమార్, తండ్రి పేరు "క్యాటీ బాస్", తల్లి పేరు "కాటియా దేవి"గా నమోదు చేశారు. అప్లికేషన్‌లో క్యాట్ కుమార్ ఫోటో కూడా ఉంది. ఈ అప్లికేషన్ పోర్టల్‌లో కనిపించడంతో అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై రోహ్తాస్ జిల్లా కలెక్టర్ ఉదితా సింగ్ వెంటనే స్పందించారు.

New Update
bihar fake residence application

రెసిడెన్షియల్ సర్టిఫికేట్(Residential Certificate) అంటే అది ఓ అడ్రస్ ఫ్రూఫ్.. అది ప్రభుత్వం అధికారికంగా మంజూరు చేస్తోంది. అలాంటి నివాస దృవీకరణ పత్రం కుక్కలకు, పిల్లులకు, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఇవ్వడం అనేది ఆ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికే మాయని మచ్చ లాంటిది. బిహార్‌ రాష్ట్రంలో గవర్నమెంట్ ఆన్‌లైన్ సర్వీసులు అపహాస్యం చేసే ఘటనలు మరోసారి వెలుగుచూసింది. వారాల క్రితం 'డాగ్ బాబు' అనే కుక్క పేరుతో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది ఒక్కటి అంటే.. ఏదో పొరపాటున జరిగిందని అనుకోవచ్చు. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు మీద రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు అధికారుల దృ‌ష్టికి వచ్చింది. దాన్ని పరిశీలించిన అధికారులు అప్లికేషన్ రిజక్ట్ చేశారు. 

Also Read :  తెరుచుకోని ఎయిరిండియా ఫ్లైట్‌ డోర్లు.. భయాందోళనలో ప్రయాణికులు

Residential Certificate Application Name Of Kat Kumar

ఇప్పుడు 'క్యాట్ కుమార్'(Kat Kumar) అనే పిల్లి పేరుతో దరఖాస్తు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ షాకింగ్ ఘటన రోహ్తాస్ జిల్లాలో చోటుచేసుకుంది.

దరఖాస్తు వివరాల ప్రకారం.. "క్యాట్ కుమార్" తండ్రి పేరు "క్యాటీ బాస్", తల్లి పేరు "కాటియా దేవి"గా నమోదు చేశారు. అప్లికేషన్‌లో క్యాట్ కుమార్ ఫోటో కూడా ఉంది. ఈ అప్లికేషన్ అఫీషియల్ పోర్టల్‌లో కనిపించడంతో అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై రోహ్తాస్ జిల్లా కలెక్టర్ ఉదితా సింగ్ వెంటనే స్పందించారు. ఈ దరఖాస్తును పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నస్రిగంజ్ రెవెన్యూ అధికారి కౌషల్ పటేల్‌ను ఆదేశించారు.

"క్యాట్ కుమార్" రెసిడెన్షియల్ దరఖాస్తు చేసిన వ్యక్తులను గుర్తించేందుకు నస్రిగంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నివాస ధ్రువపత్రాల కోసం అప్లికేషన్లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ కొందరు వ్యక్తులు ఇలాంటి హాస్యస్పదమైన అప్లికేషన్లు పెడుతున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయని, ఇవి చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

గతంలో పట్నాలోని మసౌర్హి బ్లాక్‌లో 'డాగ్ బాబు' పేరుతో ఒక కుక్కకు నివాస ధ్రువపత్రం జారీ అయింది. ఈ ఘటనపై విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు.

Also Read :  వీధి కుక్కలను అక్కడికి తరలించండి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తాజాగా, ఈ 'క్యాట్ కుమార్' ఘటన మరోసారి అధికారులకు, ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఈ దరఖాస్తు వెనుక ఉన్న అల్లరి మూకలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు