Micro Soft AI Hub: భారత్ లో మైక్రోసాఫ్ట్ ఏఐ హబ్..ప్రధాని మోదీను కలిసిన సత్య నాదెళ్ళ

భారత్ లో అతి పెద్ద ఏఐ హబ్ ను ఏర్పాటు చేయనుంది మైక్రోసాఫ్ట్. దీని కోసం 17.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఆసియాలోనే ఇది అతి పెద్దది అని చెప్పారు. 

New Update
satya nadella

ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోంది. ప్రపంచం అంతా దీనిపై పెట్టుబడులు పెడుతోంది. పెద్ద కంపెనీల నుంచి చిన్న వాటి వరకు ఏఐలో పెట్టుబడులు పెడుతూ దాని దృష్టిని సారించాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ భారత్ ఏఐ మీద పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ రోజు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల(microsoft-ceo-satya-nadella) భారత ప్రధాని మోదీ(PM Modi)ని కలిశారు. భారత్‌ తన ఏఐ లక్ష్యాలను చేరుకోవడానికి 17.5 బిలియన్‌ డాలర్లను (రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించారు. దీని గురించి సత్య నాదెళ్ళ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.  భారత్ లో ఏఐ అవకాశాలపై ప్రధాని మోదీ, తన మధ్య స్ఫూర్తిదాయకమైన సంభాషణ జరిగిందని సత్య నాదేళ్ళ తెలిపారు. 

Also Read :  సాధారణ స్థితికి ఇండిగో సేవలు.. సీఈవో సంచలన ప్రకటన

ఆసియాలోనే భారత్ టాప్..

భారత్ లో ఏఐ అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ మద్దతు ఇస్తుందని సత్య నాదెళ్ళ చెప్పారు.  అందుకే ఆసియాలోనే అతి పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్దమయ్యామని తెలిపారు. భారత్‌లో కృత్రిమ మేధ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను అందించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని తెలిపారు. రాబోయే నాలుగేళ్ళల్లో 17.5 లక్షల కోట్ల మొత్తాన్ని ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన 3 బిలియన్ డాలర్లకు ఇది అదనమని సత్య చెప్పారు. 

Also Read :  రాజ్యసభలో వందేమాతరం వివాదం.. ప్రియాంక గాంధీకి కౌంటర్ ఇచ్చిన అమిత్ షా

ప్రధాని హర్షం..

మైక్రోసాఫ్ట్ పెట్టుబడులపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆయన కూడా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.  సత్యనాదెళ్లతో ఫలవంతమైన చర్చ జరిగిందని తెలిపారు. ఆసియాలోనే అతి పెట్టుబడి కేంద్రంగా భారత్ ను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఏఐ విషయంలో భారత్ ఆశావాదంతో ఉందని...దేశ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 

Advertisment
తాజా కథనాలు