/rtv/media/media_files/2025/12/09/amit-shah-2025-12-09-16-17-42.jpg)
Amit Shah
వందేమాతరం(Vande Mataram) గేయంపై రాజ్యసభలో చర్చ జరగడంపై ప్రియాంక గాంధీ(priyanka-gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. త్వరలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం వందేమాతరంపై చర్చ చేపట్టిందని ఆరోపించారు. అయితే తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) ఆమె వ్యాఖ్యలను ఖండించారు. జాతీయ గీతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని అన్నారు.
జాతీయ గీతం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చ నిర్వహిస్తే ఇది ఎందుకని కొందరు సభ్యులు(పరోక్షంగా ప్రియాంక గాంధీని విమర్శిస్తూ) ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ గేయానికి గతంలో ఎంతో ఔన్నత్యం ఉందని.. 2047 కూడా ఉంటుందని తెలిపారు. వందేమాతర గీతం గురించి ఎందుకు చర్చించాలని ప్రశ్నిస్తున్న వాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఈ అంశాన్ని ఎన్నికలకు ముడిపెట్టి వందేమాతరం కీర్తిని తక్కువ చేసి చూపాలని కొందరు అనుకుంటున్నట్లు విమర్శలు చేశారు.
Amit Shah Counter To Priyanka Gandhi
వందేమాతరం గీతాన్ని రాసిన బంకించంద్ర ఛటర్జీ బెంగాల్‌లో పుట్టినప్పటికీ ఈ గీతం బెంగాల్‌కో, భారత్‌కో మాత్రమే పరిమితమైంది కాదన్నారు. దేశ స్వాతంత్యం కోసం పోరాడిన భారత వీరులు ప్రపంచంలో ఎక్కడ కలిసినా వందేమాతరం అని నినదించేవారని తెలిపారు. ఇప్పటికి దేశ సరిహద్దుల్లో అంతర్గత భద్రత కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న మన సైనికుల నోట నిరంతరం వందేమాతరం మారుమోగుతుందన్నారు. తరతరాలకు వందేమాతరం స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు.
Also Read: తెలంగాణకు కేంద్రం బిగ్ షాక్.. కొత్త ఎయిర్పోర్ట్స్ కు బ్రేక్!
అంతేకాదు బుజ్జగింపు రాజకీయాల కోసం వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్ విడగొట్టిందని.. ఇలా చేయకపోతే దేశ విభజన జరిగేది కాదని అమిత్ షా విమర్శలు చేశారు. వందేమాతరం గీతం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో దేశంలో ఎమర్జె్న్సీ వచ్చిందని.. దీనివల్ల జాతీయగీతం కీర్తిని చాటేందుకు అవకాశం కూడా లేని పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేమాతరం అని నినదించిన వాళ్లను అప్పట్లో ఇందిరాగాంధీ జైళ్లో పెట్టించారంటూ విమర్శించారు. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఈరోజు నాటి నాయకత్వం వరకు ఈ గీతాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారంటూ ధ్వజమెత్తారు. బ్రిటిష్ వాళ్లు సైతం మన జాతీయగేయాన్ని ఆపలేకపోయారని.. వాళ్ల సంస్కృతిని అనుసరించేవారు కూడా ఎప్పటికీ దాన్ని ఆపలేరని అన్నారు.
Follow Us