/rtv/media/media_files/2025/12/09/indigo-2025-12-09-20-15-05.jpg)
IndiGo
గత కొన్నిరోజులుగా ఇండిగో విమానయాన సంస్థలో సంక్షోభం కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలు పరిష్కరించేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. మంగళవారం కూడా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. కానీ కార్యకలాపాలు మాత్రం సాధారణ స్థితికి వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ఇండిగో సీఈవో పీటల్ ఎల్బర్స్ ఎక్స్‌లో వెల్లడించారు.
Also Read: భారత్ లో మైక్రోసాఫ్ట్ ఏఐ హబ్..ప్రధాని మోదీను కలిసిన సత్య నాదెళ్ళ
IndiGo Back On Its Feet
''మీ విమానయాన సంస్థ కార్యకలపాలు సాధారణ స్థితికి వచ్చాయి. కార్యనిర్వహక వైఫల్యం జరగడం వల్ల మిమ్మల్ని నిరాశపరిచినందుకు చింతిస్తు్న్నాం. లక్షలాది మంది వినియోగదారులు ఇప్పటికే రీఫండ్లు పొందారు. ఈ ప్రక్రియను మేము ఇంకా కొనసాగిస్తున్నాం. ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్నపోయిన ప్రయాణికుల లగేజీని కూడా వాళ్ల ఇంటి వద్దకు పంపించాం. ప్రయాణికుల అవసరాలను అనుగణంగానే వ్యవహరిస్తున్నాం. నిన్నటి నుంచి వందకు పైగా గమ్యస్థానాలకు ఇండిగో సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వానికి కూడా సహకరిస్తున్నాం. ఈ సమస్యకు గల కారణాలపై ఫోకస్ పెట్టామని'' పీటర్ వివరించారు.
IndiGo Operations Normalised | A Message From Pieter Elbers, CEO, IndiGo pic.twitter.com/VVB2yTsIBy
— IndiGo (@IndiGo6E) December 9, 2025
Also Read : గుడ్‌న్యూస్.. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలు వెల్లడించిన మస్క్
Follow Us