/rtv/media/media_files/2025/02/16/ed3NJN8ozaEEUo4yIN6y.jpg)
thandel movie latest collections
నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ థియేటర్లలో దుమ్ము దులిపేస్తోంది. కనీ వినీ ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 7న గ్రాండ్ లెవెల్లో విడుదలైన ఈ సినిమా అదరగొడుతోంది. ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది.
Also Read : Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్!
అరుదైన ఫీట్
అంచనాలకు మించి సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో కెవ్వుమనిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. తండేల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ రాబట్టి అబ్బురపరచింది. కేవలం 9 రోజుల్లోనే ఈ ఫీట్ అందుకుని అక్కినేని ఫ్యామిలీలో ఫుల్ జోష్ నింపింది. ఈ విషయాన్ని స్వయంగా మూవీ మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
బాక్స్ ఆఫీస్ దుళ్లకొట్టేసారు..
— Thandel (@ThandelTheMovie) February 16, 2025
థియేటర్స్ కి జాతర తెచ్చేసారు 💥💥#Thandel is a BLOCKBUSTER TSUNAMI ❤️🌊🔥#BlockbusterThandel crosses 𝟏𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐑𝐎𝐒𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 💥💥
Book your tickets now!
🎟️ https://t.co/5Tlp0WMUKb#100CroresThandelJaathara pic.twitter.com/wVug1dG9X1
బాక్సాఫీసు దుళ్లకొట్టి.. థియేటర్లకు జాతర తెచ్చారని మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ముందు వరకు ఒక్క హిట్ లేక అల్లాడిపోయిన నాగ చైతన్యకు ఇదొక శుభారంభం అని చెప్పొచ్చు. ఇక రూ.100 కోట్ల మైలురాయిని నాగచైతన్య తొలిసారి సాధించడంతో ఎనలేని ఆనందంలో మునిగితేలుతున్నాడు. అంతేకాకుండా అక్కినేని హీరో రూ.100 కోట్ల మార్క్ టచ్ చేయడం కూడా ఇదే తొలిసారి.
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
ఈ సినిమాలో నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో నటించి అదరగొట్టేశాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. లవ్, ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. ఈ చిత్రానికి ప్రాణం పోసింది మ్యూజిక్ అనే చెప్పాలి. దేవీశ్రీ అందించిన సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి.