Crime: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు

ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబానికి చెందిన వృద్ధురాలు రెండ్రోజుల పాటు ఆ శవాలతో పాటే ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Woman, 65, Found Living With Corpses Of Family Members For 2 Days In Odisha

Woman, 65, Found Living With Corpses Of Family Members For 2 Days In Odisha

ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబానికి చెందిన వృద్ధురాలు రెండు రోజుల పాటు ఆ శవాలతో పాటే ఉంది. ఇక చివరికీ ఆ ఇంటి నుంచి మరో గ్రామంలో ఉన్న తన కొడుకు వద్దకు వెళ్లింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. చౌలియా ఖమర్‌ గ్రామంలో 65 ఏళ్ల పుష్పాంజలి దాస్ తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఫిబ్రవరి 13న ఆమె భర్త శంకర్షన్ (70) ఓ గదిలో, కూతురు సువర్ణ (45), మనవడు సంతోష్ (18) మరో గదిలో ఉరేసుకొని కనిపించారు.  

Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

సీలింగ్‌కు వెలాడుతూ ఉన్న కుటుంబ సభ్యుల మృతదేహాలతోనే ఆ ఇంట్లో వృద్ధురాలు రెండ్రోజుల పాటు గడిపింది. చివరికి ఫిబ్రవరి 15న ఆమె తన ఇంటి నుంచి బయటికి వచ్చి దెంకనల్‌ టౌన్‌కు వచ్చింది. కుటుంబ గొడవల వల్ల 30 ఏళ్లుగా తండ్రికి దూరంగా ఉంటున్న కొడుకు ప్రసన్న కుమార్ దాస్ ఇంటికి వెళ్లింది. అతడికి తండ్రి, అక్క, ఆమె కొడుకు చనిపోయినట్లు చెప్పింది.  

Also Read: షాకింగ్ న్యూస్.. కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఎమ్మెల్యే!

ఇది విన్న ప్రసన్న కుమార్‌ కంగుతిన్నాడు. గ్రామంలో తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి తమ ఇంటికి వెళ్లి చూడమన్నాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని.. ఇక్కడకు రావాలని చెప్పాడు. చివరికీ ప్రసన్న కుమార్ తన తల్లితో కలిసి తన ఇంటికి చేరుకున్నాడు. తండ్రి, అక్కడ, మేనల్లుడు మృతదేహాలను చూసి షాకైపోయాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వాళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా ? ఎవరైనా హత్య చేసి ఉరేసారా అనేదానిపై విచారణ జరుపుతున్నారు.    

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు