/rtv/media/media_files/2025/12/05/geeta-2025-12-05-07-47-32.jpg)
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine War)మొదలయ్యాక రష్యా అధ్యక్షుడు పుతిన్(russia president vladimir putin) మొదటి సారి ఇండియాకు వచ్చారు. రష్యా నుంచి చమురు కొనగోలు చేస్తుందన్న కారణంగా భారత్ పై 25 శాతం అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో పుతిన్ భారత్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏడేళ్ల తరువాత ఆయన మన దేశానికి వస్తున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడి కోసం ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాంతో పాటూ ఆయన కోసం ఐదెంచల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. 4 డజన్లకు పైగా రష్యా భద్రతా బలగాలు పుతిన్ టూర్ మార్గంలో గస్తీ కాస్తున్నాయి. వీరికి తోడు భారత ఎన్ఎస్‌జీ కమెండోలు కూడా రంగంలోకి దిగారు.
Also Read : హైదరాబాద్ హౌస్‌లో పుతిన్‌కు ఆతిథ్యం.. అది ఎవరిదో తెలుసా?
కరచాలనం, హగ్..
ఈ క్రమంలో నిన్న సాయంత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ప్రధాని మోదీ(PM Modi) ఘన స్వాగతం పలికారు. భారత్‌కు వచ్చిన పుతిన్‌కు పాలం విమానాశ్రయంలో ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలికారు. విమానం దిగివచ్చిన పుతిన్ కు స్వాగతం పలికిన మోదీ కరచాలనంతోపాటు ఆలింగనం చేసుకున్నారు. భారతీయ నృత్యంతో ఆయనకు వెల్కమ్ చెప్పారు. ఆ తరువాత ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని ఆయనకు ప్రైవేటుగా విందు ఇచ్చారు.
Also Read : హిడ్మాది భూటకపు ఎన్‌కౌంటర్...మావోయిస్టు పార్టీ కీలక లేఖ
రష్యన్ భగవద్గీత..
పీఎంసివాసంలో విందుతో పాటూ పుతిన్ కు ప్రధాని మోదీ ఒక అమూల్యమైన బహుమతిని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. రష్యన్ భాసలోకి అనువదించిన భగవద్గీతను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా భగవద్గీత గురించి పుతిన్ కు వివరించిన ప్రధాని...దాని బోధనలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయనిమోదీ చెప్పారు. భారతదేశ శక్తి, సాంప్రదాయాలకు గీత ఒక ఆమోద ముద్రగా అభివర్ణించారు. కఠినమైన భద్రత, ఇంధన ఒప్పందాలకు మించి స్నేహాన్ని సూచించడానికే ఈ గ్రంథం ఎంచుకున్నట్టు ప్రధాని తెలిపారు.
Presented a copy of the Gita in Russian to President Putin. The teachings of the Gita give inspiration to millions across the world.@KremlinRussia_Epic.twitter.com/D2zczJXkU2
— Narendra Modi (@narendramodi) December 4, 2025
Follow Us