PM Modi: POKని భారత్‌కు అప్పగించాల్సిందే.. మోదీ సంచలన డిమాండ్

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్‌ది ఎప్పటికీ ఒకటే మాట అని తేల్చి చెప్పారు. POKని భారత్‌కు అప్పగించాలని పాకిస్తాన్‌ మోదీ డిమాండ్ చేశారు. త్రివిధ దళాలకు ప్రధాని కీలక ఆదేశాలు జారీ చేశారు.

New Update
pm

PM Modi

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్‌ది ఎప్పటికీ ఒకటే మాట అని తేల్చి చెప్పారు. POKని భారత్‌కు అప్పగించడం తప్పా.. పాకిస్తాన్‌కు వేరే గత్యంతరం లేదని మోదీ అన్నారు. త్రివిధ దళాలకు మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అటు నుంచి తుపాకి తూటాలు వస్తే.. ఇటు నుంచి మిస్సైల్స్ దూసుకెళ్లాలని ఇండియన్ ఆర్మీకి మోదీ సూచించారు. పాకిస్తాన్‌ దాడులు జరిపితే ప్రతిదాడులు చేయాలని ప్రధాని చెప్పారు. ఇండియాకు ఎవరి మధ్య వర్తిత్వం అవసరం లేదని ఆయన సష్టం చేశారు. పాకిస్తాన్ దాడులు జరిపితే.. ఇండియా కూడా దాడులు చేస్తోందని హెచ్చరించారు. 

Also Read :  హైదరాబాద్‌లో క‌రాచీ బేక‌రి ధ్వంసం.. పేరు మారుస్తారా? బోర్డు తీస్తారా? - వీడియో!

PM Modi Demands Pakistan

Also Read :  ఈ రాత్రికి ఒక్క డ్రోన్ వచ్చినా.. రేపటికి పాక్ ఉండదు.. భారత్ సీరియస్ వార్నింగ్!

పాకిస్తాన్‌తో ఉగ్రవాదుల అంశంపై తప్పా మరో అంశంపై భారత్ మాట్లాడదని ప్రధాని మోదీ ఖరాఖండిగా చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని మోదీ పునరుద్ఘటించారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇచ్చామని ఆయన అన్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిభిరాలను నేలమట్టం చేశామని ప్రధాని చెప్పుకొచ్చారు. భారత్ వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్‌ చేతులెత్తేసిందని మోదీ అన్నారు. ఉగ్రవాదం ఆగే వరకు సిందూ నది జలాల ఒప్పందం నిలుపివేస్తామని ఆయన అన్నారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. దేశ భద్రతలో రాజీపడే అవకాశమే లేదని మోదీ జేడీ వాన్స్‌తో తేల్చి చెప్పారు. భారత్‌కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని జేడీ వాన్స్ తో చెప్పారు.

Also Read :  పాక్‌ దాడి చేస్తే మేము కూడా చేస్తాం.. అమెరికాకు తేల్చిచెప్పిన మోదీ

Also Read :  ఈటలతో నడి రోడ్డుపై గుంజీలు తీయిస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

(pm modi | india pak war | india operation sindoor | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు