Karachi Bakery: హైదరాబాద్‌లో క‌రాచీ బేక‌రి ధ్వంసం.. పేరు మారుస్తారా? బోర్డు తీస్తారా? - వీడియో!

భారతదేశంపై పాకిస్తాన్ దాడులకు నిరసనగా ఇవాళ తెలంగాణలో బీజేపీ కార్తకర్తలు శంషాబాద్‌లోని కరాచీ బేకరీ ముందు నిరసన చేపట్టారు. పాకిస్తాన్‌కు, కరాచీ బేకరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరాచీ బేకరీ బోర్డును ధ్వంసం చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

New Update
Hyderabad Shamshabad Karachi Bakery destroy by Bjp Workers

Hyderabad Shamshabad Karachi Bakery destroy by Bjp Workers

భారతదేశంపై పాకిస్తాన్ దాడులకు నిరసనగా ఇవాళ (ఆదివారం) తెలంగాణలో బీజేపీ కార్తకర్తలు నిరసన చేపట్టారు. శంషాబాద్‌లోని కరాచీ బేకరీ ముందు పలువరు కార్యకర్తలు బీజేపీ జెండాలతో ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా పాకిస్తాన్‌కు కరాచీ బేకరికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రచ్చ రచ్చ చేశారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీని గొప్పగా ప్రశంసించారు. 

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

కరాచీ బేకరీ ధ్వంసం

అయితే అదే సమయంలో కొంతమంది కరాచీ బేకరీ బోర్డును ధ్వంసం చేశారు. కర్రలతో డిస్‌ప్లే బోర్డును తుక్కు తుక్కు చేశారు. బేకరీ పేరు మార్చాలని అది కాకపోతే.. బ్రాండ్ నేమ్ డిస్ ప్లే బోర్డును అయినా తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం నిరసన కారులను అక్కడ నుంచి చెదరగొట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

కాగా ఇటీవలే కరాచీ బేకరీ యాజమాన్యం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులకు ఒక విజ్ఞప్తి చేసింది. 75 ఏళ్లుగా ఈ పేరుతోనే కరాచీ బేకరీ యాజమాన్యం కొనసాగుతుందని.. ఇప్పుడు పేరు మార్చడం సాధ్యం కాదని తెలిపింది. తమ నాన్న ప్రేమతో కరాచీ బేకరీ పెట్టుకున్నామని.. ఆయన జ్ఞాపకార్థంగా దానిని అలానే ఉంచినట్లు యాజమాన్యం పేర్కొంది. అంతేకాకుండా గత 40 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నామని తెలిపింది. పాకిస్తాన్‌తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పింది. 

Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పై దాడి చేసింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ఆపరేషన్ సిందూర్‌తో ఇండియన్ ఆర్మీ లేపేసింది. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం అయ్యారు. అయితే నిన్న (శనివారం) ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అది జరిగిన కొన్ని గంటల్లోనే పాక్ మళ్లీ భారత్ సరిహద్దు ప్రాంతమైన జమ్మూ కాల్పులు జరిపినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. 

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

hyderabad-karachi-bakery | latest-telugu-news | telugu-news | ind pak war

Advertisment
Advertisment
తాజా కథనాలు