PM Modi: పాక్‌ దాడి చేస్తే మేము కూడా చేస్తాం.. అమెరికాకు తేల్చిచెప్పిన మోదీ

ప్రధాని మోదీ.. అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. పాకిస్థాన్‌ దాడులు చేస్తే.. భారత్‌ కూడా తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ కాల్పులు జరపకపోతే తాము సంయమనం పాటిస్తామని చెప్పారు.

New Update

భారత్‌-పాకిస్థాన్‌ శనివారం కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ పాక్ మాత్రం మళ్లీ కాల్పులకు పాల్పడింది. అయినప్పటికీ భారత్‌ పాక్ దొంగబుద్ధిని తిప్పికొట్టింది. పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చర్చలపై తాజాగా ప్రధాని మోదీ.. అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. పాకిస్థాన్‌ దాడులు చేస్తే.. భారత్‌ కూడా తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ కాల్పులు జరపకపోతే తాము సంయమనం పాటిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  

Also Read: 100 మందికి పైగా ఉగ్రవాదులను లేపేశాం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్‌ది ఎప్పటికీ ఒకటే మాట అని తేల్చి చెప్పారు. POKని భారత్‌కు అప్పగించడం తప్పా.. పాకిస్తాన్‌కు వేరే గత్యంతరం లేదని మోదీ అన్నారు. త్రివిధ దళాలకు మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అటు నుంచి తుపాకి తూటాలు వస్తే.. ఇటు నుంచి మిస్సైల్స్ దూసుకెళ్లాలని ఇండియన్ ఆర్మీకి మోదీ సూచించారు. పాకిస్తాన్‌ దాడులు జరిపితే ప్రతిదాడులు చేయాలని ప్రధాని చెప్పారు. ఇండియాకు ఎవరి మధ్య వర్తిత్వం అవసరం లేదని ఆయన సష్టం చేశారు. పాకిస్తాన్ దాడులు జరిపితే.. ఇండియా కూడా దాడులు చేస్తోందని హెచ్చరించారు. 

Also Read: భారత్ చేతిలో చైనా సీక్రెట్స్.. భలే దొరికిపోయిందిగా?

telugu-news | rtv-news | national-news | pm modi 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు