/rtv/media/media_files/2025/05/11/Et41Nmju9QZvzlQ21gQb.jpg)
పాకిస్తాన్ కాల్పుల విరమణను మరోసారి ఉల్లంఘిస్తే, తాము మరింత గట్టి సమాధానం ఇస్తామని డిజిఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ హెచ్చరించారు. తనకు నిన్న మధ్యాహ్నం 3:35 గంటల సమయంలో పాకిస్తాన్ డిజిఎంఓతో కాల్ సంబాషణ జరిగిందని, ఆయన ప్రతిపాదన మేరకు 2025 మే 10న సాయంత్రం 5:00 గంటల నుండి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఆగిపోయిందని అన్నారు. ఈ ఒప్పందాన్ని మరింత బలోపేతం చేయడానికి, దీర్ఘకాలికంగా మార్చడానికి మార్గాలను చర్చించడానికి మే 12, 2025న మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ మాట్లాడాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు.
అయితే పాకిస్తాన్ సైన్యం ఈ ఒప్పందాలను కొన్ని గంటల్లోనే ఉల్లంఘించి, మన ఒప్పందాలకు కట్టుబడి ఉండమని చూపించడానికి సరిహద్దు కాల్పులు డ్రోన్ దాడులకు పాల్పడిందని తెలిపారు. ఈ ఉల్లంఘనలకు తాము గట్టిగా స్పందించామని, ఈ ఉదయం పాకిస్తాన్ డీజీఎంఓకు దీనినే హాట్‌లైన్ సందేశం పంపామని, అందులో ఈ ఉల్లంఘనలను స్పష్టంగా ఎత్తి చూపామని లెఫ్టినెంట్ జనరల్ అన్నారు. పాకిస్తాన్ ఈ ఉల్లంఘనలను పునరావృతం చేస్తే బలమైన ప్రతిస్పందన ఉంటుందని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే... వెంటనే, బలమైన సమాధానం ఇవ్వాలని ఆర్మీ చీఫ్, కమాండర్లకు సూచించినట్లుగా ఆయన స్పష్టం చేశారు.
DGMO: It took couple of hours to for Pakistan to violate the ceasefire agreement#IndiaPakistanWar #IndianArmy #IndiaPakCeasefire #DGMO pic.twitter.com/qfMCG0LhiM
— News18 (@CNNnews18) May 11, 2025
వందమంది ఉగ్రవాదులను చంపాం
పహల్గామ్‌లో భారతీయ పౌరులపై దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్‌ను ప్లాన్ చేసినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఈ ఆపరేషన్ కు స్పష్టమైన సైనిక లక్ష్యం ఉందన్నారు. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం ఉగ్రవాదులను నిర్మూలించడం మాత్రమేనని ఆయన అన్నారు. తాము 100 మందికి పైగా ఉగ్రవాదులను చంపామని.. ఉగ్రవాదుల స్థావరాన్ని పేల్చివేశారనే ఆధారాలను కూడా ఆయన చూపించారు. ఈ దాడుల్లో ముదస్సర్ ఖర్, హఫీజ్ జమీల్, యూసుఫ్ అజార్ వంటి ముగ్గురు పెద్ద ఉగ్రవాదులు హతమయ్యారు.
భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ గతంలో అనేక ప్రయత్నాలు చేసిందని, అయితే ఈ ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయని రాజీవ్ ఘాయ్ తెలిపారు. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణుల ద్వారా అనేక సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది, కానీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఈ ముప్పులన్నింటినీ సకాలంలో తిప్పికొట్టిందని తెలిపారు.