/rtv/media/media_files/2025/09/15/parliamentary-panel-suggests-licensing-requirements-for-ai-content-creators-2025-09-15-15-35-51.jpg)
Parliamentary panel suggests licensing requirements for AI content creators
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా(Social Media) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎలాంటి సమాచారం తెలుసుకోవాలనుకున్న ప్రతిఒక్కరు సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. అలాగే కంటెంట్ అందించే క్రియేటర్లు కూడా రోజురోజుకు పెరుగుతున్నారు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో కూడా కంటెంట్‌ను క్రియేట్(digital-content-creators) చేస్తున్నారు. అయితే ఏఐ సాయంతో కంటెంట్ క్రియేట్ చేసేవాళ్లు కచ్చితంగా లైసన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుందని పార్లమెంటరీ ప్యానెల్ సూచనలు చేసింది.
Also Read: ఈ అనుమానంతోనే లండన్‌లో నిరసనలు.. బ్రిటన్‌ని కదిలించిన ముగ్గురు పిల్లల చావు
దీనివల్ల ఇకనుంచి ఏఐ(Artificial Intelligence) ఆధారిత వీడియోలు, కంటెంట్‌కు పర్మిషన్లు తప్పనిసరిగా మారనున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వాటిని అడ్డుకునేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు సమాచారం. కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ రిపోర్ట్ అందించింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. దీనివల్ల ఫేక్ వార్తలు వ్యాప్తి చేసే సంస్థలు, వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు మార్గం సులువు కానుంది.
Also read: భర్త ట్రిపుల్ తలాక్.. కోర్టు ముందే భర్తను చెప్పుతో చితకబాదిన భార్య: వీడియో వైరల్
అంతేకాదు ఈ ఈ కమిటీ కొన్నిరోజుల క్రితమే తమ డ్రాఫ్ట్ రిపోర్టును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. సమాచారం, ఎలక్ట్రానిక్ ఐటీ మంత్రిత్వ శాఖలతో పాటు ఇతర మంత్రులు, విభాగాల మధ్య బలమైన సమన్వయం అవసరమని తెలిపారు.
ఇటీవల డీఫ్ ఫేక్ అంశం కూడా తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల ముఖాలతో అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేయడం దుమారం రేపింది. దీంతో డీఫ్ ఫేక్ సాంకేతికత వల్ల వచ్చే సమస్యలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఐటీ శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఓ సంఘాన్ని ఏర్పాటు చేసింది. డీఫ్ ఫేక్ స్పీచ్, వీడియోలు, వాయిస్ గుర్తించేందుకు వీలుగా రెండు ప్రాజెక్టులు మొదలైనట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఫేక్ న్యూస్ కూడా ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారినట్లు కమిటీ తెలిపింది.
Also Read: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోల హతం.. మృతుల్లో అగ్రనేత