Viral Video: భర్త ట్రిపుల్ తలాక్.. కోర్టు ముందే భర్తను చెప్పుతో చితకబాదిన భార్య: వీడియో వైరల్

యూపీలో ఓ భర్త కోర్టు ఆవరణంలోనే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం ఆమె భర్తపై చెప్పుతో చితకబాదింది. తనకు న్యాయం కావాలని కోర్టును ఆశ్రయించింది.

New Update
Uttarpradesh

Uttarpradesh

కోర్టు ముందే భార్య భర్తను చెప్పుతో చితకబాదిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలో ఓ యువతికి 2018లో వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పుటి నుంచి ఆమెను భర్త వేధిస్తున్నాడు. అదనపు కట్నం తీసుకుని రమ్మని కొట్టేవాడు. పిల్లలు పుడితే మారుతారని ఆమె అనుకుంది. కానీ పిల్లలు పుట్టిన తర్వాత అతను మారలేదు. ఇంకా కొట్టడం ప్రారంభించాడు. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. దీంతో ఆమె కోర్టు సాయం కోరింది. ఆర్థిక సాయం కోరుతూ కోర్టులో దావా వేసింది. పిల్లలను తన దగ్గరకు ఇవ్వడం లేదని, ఒంటరిని అయిపోయానని ఆమె కోర్టులో కేసు వేసింది. ఈ క్రమంలో రాంపూర్‌ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. దీనికి హాజరైన ఆమెకు భర్త కోర్టు బయటే మూడు సార్లు తలాక్ అని చెప్పాడు. ఆ తర్వాత భార్యపై దాడి చేశాడు. దీంతో బాధితురాలు ఆత్మరక్షణ కోసం భర్తపై చెప్పుతో దాడి చేసింది.

ఇది కూడా చూడండి: Road Accident: అయ్యో దేవుడా.. నలుగురు స్పాట్ డెడ్.. దైవ దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు

ఇది కూడా చూడండి: Family suicide : ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు..భర్త మృతి..భార్య ఏం చేసిందంటే..?

ఆత్మ రక్షణ కోసం దాడి చేశానని..

కోర్టు ముందే భర్తను చెప్పుతో కొట్టడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆమె వేసిన కేసు వెనక్కి తీసుకోవాలని భర్త, మామ కోరారు. తాను వెనక్కి తీసుకోని చెప్పడంతో  కోపంతో ఆమెపై దాడి చేశారు. అక్కడే మూడుసార్లు ‘తలాక్’ చెప్పి ఆమెపై దాడికి దిగాడు. ఈ క్రమంలోనే ఆమె ఆత్మరక్షణ కోసం భార్తపై దాడి చేసినట్లు తెలిపింది.  ఇంకా ఏ మార్గం లేక దాడి చేసినట్లు ఆమె వెల్లడించింది. తన జీవితాన్ని నాశనం చేశారని, తన పిల్లలను దూరం చేశారని తెలిపింది. ఇప్పుడు మూడుసార్లు తలాక్ చెప్పి దాడి చేస్తే ఎలా సహిస్తానని ఆమె అన్నది. తనకు న్యాయం కావాలని, తన ఇద్దరు కూతుళ్లను తనకు అప్పగించాలని కోరింది. భరణంతో పాటు ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో నివసించే హక్కు కావాలని ఆమె డిమాండ్ చేసింది. 

Advertisment
తాజా కథనాలు