/rtv/media/media_files/2025/09/15/family-suicide-2025-09-15-13-09-23.jpg)
Family suicide
Family suicide : కర్ణాటక గోనకనహళ్లిలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు పిల్లలను చంపేశారు దంపతులు. ముందుగా 11 ఏళ్ల కుమార్తె, 7ఏళ్ల కొడుకు గొంతుకు సున్నీబిగించి చంపిన శివకుమార్(32), మంజుల (30) అనంతరం వారు ఆత్మహత్యయత్నం చేశారు. భర్త శివకుమార్ మృతి చెందగా మంజుల ప్రాణాలతో బయటపడింది. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోసకోటె తాలూకాలోని గోణకనహళ్ళిలో జరిగిన ఈ ఘటనలో శివు (32), పిల్లలు చంద్రకళ (11), ఉదయ్‌సూర్య (7) మృతులు కాగా, శివు భార్య మంజుళ క్షేమంగా బయటపడింది, ఆమెను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also Read: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనులు చేసుకుని జీవించే శివు కొంతకాలం కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆయనకు ఏ పనీ చేత కావడం లేదు. కుటుంబం గడవడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో పాటు ఇంట్లో నిత్యం భార్య భర్తల మధ్య అనుమానంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవితం మీద విరక్తి చెంది కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. అలా అనుకున్న వెంటనే ఆదివారం మధ్యాహ్నం దంపతులు మొదట ఇద్దరు పిల్లలను చున్నీతో గొంతుకు బిగించి ప్రాణాలు తీశారు, ఆ తరువాత భార్యభర్తలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో భర్త చనిపోగా, తాడు తెగిపోవడంతో మంజుళ కిందపడి బతికింది.
Also Read: కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?
దీంతో భర్త ఫోన్ తీసుకుని తన తండ్రికి కాల్ చేయాలనుకుంది, ఫోన్ లాక్ తెలియకపోవడంతో, పక్కింటికి వెళ్లి ఫోన్ తీసుకుని జరిగింది చెప్పింది, తాను మళ్లీ ఆత్మహత్య చేసుకుంటానని తన తండ్రికి తెలిపింది. ఇదంతా వింటున్న పక్కింటివారు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన గురించి శివు సోదరి హోసకోటె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అనుమానంతో పోలీసులు మంజుళను విచారిస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.