/rtv/media/media_files/2025/09/15/encounter-in-jharkhand-2025-09-15-10-14-51.jpg)
Encounter in Jharkhand
Jharkhand: దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో అనేక మంది మావోలను అంతమొందించారు. లొంగిపోండి.. లేదంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇప్పటికే మావోలకు కేంద్రం సూచించింది. అంతేకాకుండా లొంగిపోతే ఉపాధి కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "ఆపరేషన్ కగార్’ మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు ఆపరేషన్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు మావోయిస్ట్ అగ్రనేతలను మట్టుబెట్టారు.
Also Read: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో
తాజాగా సోమవారం జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఎన్‌కౌంటర్లు లొంగుబాట్లతో తీవ్రంగా నష్ట పోతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతతో పాటు ముగ్గురు మావోలు మృతి చెందారు. హజరీబాగ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత సహదేవ్ సోరెన్ సహా మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సెంట్రల్ కమిటీ సభ్యుడు అయిన సహదేవ్ సోరెన్ తలపై రూ.కోటి రివార్డ్ ఉందని పోలీసులు తెలిపారు.
Also Read: ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మరో ఇద్దరు మావోయిస్టులలో బీహార్- జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హేమ్రమ్ అలియాస్ చంచల్ ఉన్నారు. ఆయనపై రూ. 25 లక్షలు, జోనల్ కమిటీ సభ్యుడు బీర్సెన్ గంఝు అలియాస్ రామ్‌ఖేలవాన్‌పై రూ.10 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, నిన్న (సెప్టెంబర్ 14) జార్ఖండ్‌లో మరో మావోయిస్టు మృతి చెందారు. పలాము జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?
గోర్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంటిత్రి అడవిలో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్)కి చెందిన సహదేవ్ సోరెన్ స్క్వాడ్‌తో భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. సంఘటనాస్థలి నుంచి సహదేవ్ సోరెన్‌తో పాటు మరో ఇద్దరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జులైలో ఓ కోబ్రా జవాన్ హత్యలో సహదేవ్ పేరు వినవచ్చింది. నాడు బొకారో పోలీసులు చేపట్టిన సెర్చి ఆపరేషన్ సందర్భంగా తగిలిన తూటా గాయానికి అతడు మరణించాడు. తాజాగా ఈ ముగ్గురు మావో నేతలు ఏదో పెద్ద ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తున్నట్లు ఎస్పీ హర్వీందర్ సింగ్ వెల్లడించారు. సెప్టెంబర్ 7వ తేదీన జరిగిన ఓ ఆపరేషన్‌లో మావోయిస్టుల సీనియర్ నాయకుడు అమిత్ హన్స్‌డా మరణించాడు. జోనల్ కమాండర్ అయిన అతడిపై రూ.10 లక్షల రివార్డు ఉంది. మొత్తం 95 కేసుల్లో అతడు నిందితుడు. వీటిల్లో చాలామంది పోలీసులు, పౌరుల హత్యలు ఉన్నాయి. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.