Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

కుంభమేళా మొదలై 28 రోజులు గడుస్తున్నప్పటికీ రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్‌ రాజ్‌ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా దాదాపు 200-300 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ లే కనపడుతున్నాయి.

New Update
kumbhtraffic

kumbhtraffic

మహా కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు ఉత్తర్‌ ప్రదేశ్ లోని ప్రయాగ్‌ రాజ్‌ కు తరలి వస్తున్నారు. ఇప్పటికే ఈ కుంభమేళా మొదలై 28 రోజులు గడుస్తున్నప్పటికీ రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్‌ రాజ్‌ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా దాదాపు 200-300 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ లే కనపడుతున్నాయి.

Also Read: Rohit Sharma: రోహిత్‌శర్మ విధ్వంసం.. 76 బంతుల్లో సెంచరీ చేసిన హిట్‌మ్యాన్

గంటల పాటు యాత్రికులు వాహనాల్లోనే ఉండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు మధ్యప్రదేశ్‌ లోనే వేలాది వాహనాలను ఆపేస్తున్నారు.యూపీ అధికారుల నుంచి అనుమతి వస్తేనే వాటిని ముందుకు అనుమతిస్తున్నట్లు తెలుస్తుంది.

Also Read: Prashant Bhushan: ఆప్‌ ఓటమిపై స్పందించిన ప్రశాంత్ భూషణ్‌.. కేజ్రీవాల్‌పై విమర్శలు

కుంభమేళాకు వెళ్లే వాహనాలతో ప్రయాగ్‌ రాజ్‌ దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాగ్ రాజ్‌-కాన్పూర్‌,ప్రయాగ్‌రాజ్‌-లఖ్‌నవూ ప్రతాప్‌గడ్‌,ప్రయాగ్‌రాజ్‌-వారణాసి,మిర్జాపూర్‌, ప్రయాగ్‌రాజ్‌-రేవా వెళ్లే జాతీయ రహదారుల్లో మూడు రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతుంది.

10 నుంచి 12 గంటల సమయం...

సుమారు 48 గంటల పాటు ట్రాఫిక్‌ లోనే చిక్కుకున్నట్లు అనేక మంది ప్రయాణికులు చెబుతున్నారు. 50 కిలోమీటర్ల మేర దూరానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని అంటున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ప్రయాగ్‌ రాజ్‌కు వెళ్తున్న వాహనాల రద్దీ దృష్ట్యా ..ఆదివారం నాడుమధ్య ప్రదేశ్‌ పరిధిలోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్‌ ను ఎక్కడికక్కడే నిలిపేశారు. 

రాష్ట్రంలోని కటనీ,మైహర్,రివా జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.సోమవారం వరకు ట్రాఫిక్‌ ను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నామని సురక్షిత ప్రాంతాలు చూసుకోవాలని కటనీ జిల్లా పోలీసులు ప్రకటించారు.రేవా-ప్రయాగ్‌ రాజ్‌ రహదారిలో వాహనాలు ముందుకు వెళ్లే ప్రసక్తి లేదని జిల్లా పోలీసులు పేర్కొన్నారు.

చాక్‌ఘాట్‌ తర్వాత విపరీతంగా రద్దీ ఉందని,దాంతో వాహనాలు నిలిపివేశామని రివా జిల్లా కలెక్టర్‌ ప్రతిభా పాల్‌ వెల్లడించారు.ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారికోసం తాత్కాలిక వసతి , నీరు, ఆహారం అందించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకే సుమారు కోటి 41లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 42 కోట్ల మందికి పైగా ప్రయాగ్‌ రాజ్‌ను దర్శించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.

Also Read: Arvind Kejriwal: పార్టీ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ కీలక సూచనలు

Also Read:జనసేన కీలక నిర్ణయం.. కిరన్‌ రాయల్‌ను పార్టీకి దూరంగా ఉంచుతూ ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు