Rahul Gandhi: 22 మంది పిల్లలను దత్తత తీసుకున్న రాహుల్ గాంధీ.. వాళ్లు ఎవరో తెలుసా?

భారత్-పాక్ కాల్పుల సమయంలో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో 22 మంది పిల్లల తల్లిదండ్రులు మృతి చెందారు. అనాథులుగా మారిన 22 మంది పిల్లలను రాహుల్ గాంధీ దత్తత తీసుకున్నారు. వీరి గ్రాడ్యూయేషన్ వరకు పూర్తి బాధ్యత రాహుల్ గాంధీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన మంచి మనస్సు చాటుకున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్-పాక్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో 22 మంది పిల్లల చదువు ఖర్చులను రాహుల్ గాంధీ భరిస్తారని తెలిపారు. 

ఇది కూడా చూడండి:బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!

భారత్-పాక్ యుద్ధం సమయంలో..

భారత్-పాక్ కాల్పుల వల్ల సరిహద్దుల్లో ఉన్నవారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారు అనాథులు కారని, వారిని జీవితాంతం తాను చూసుకుంటానని, వారి పూర్తి ఖర్చులు కూడా తానే చూసుకుంటానని రాహుల్ తెలిపారు. ఆ పిల్లల చదువులకు సంబంధించి మొదటి విడత సహాయం విడుదల చేస్తామని ఇటీవల తెలిపారు. ఆ 22 మంది పిల్లలు డిగ్రీ పూర్తి అయ్యే వరకు బాధ్యత తనదేనని వెల్లడించారు. 

ఇది కూడా చూడండి:China Floods: ముంచెత్తుతున్న భారీ వరదలు.. భయపడుతున్న ప్రజలు.. 34 మంది మృతి?

రాహుల్ గాంధీ మే నెలలో పూంచ్ పర్యటన సందర్భంగా స్థానిక పార్టీ నాయకులను కలిశారు. ఆ సమయంలో బాధిత పిల్లల జాబితాను రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి వారిని సర్వే చేసి ఓ జాబితాను తయారు చేశారు. అన్ని ప్రభుత్వ రికార్డులను క్రాస్-చెక్ చేసిన తర్వాత ఆ 22 పిల్లల పేర్లను ఖరారు చేశారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: నిమిష ఉరిశిక్ష రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర విదేశాంగ శాఖ

ఆ సమయంలో రాహుల్ గాంధీ క్రైస్ట్ పబ్లిక్ స్కూల్‌ను కూడా సందర్శించారు. ఆ స్కూల్‌లో కూడా కొందరు భారత్-పాక్ యుద్ధం సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారు. వారికి రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. పూంచ్ సరిహద్దుల్లో ఉండటంతో ఇక్కడ అనేక పాఠశాలలపై కాల్పులు జరిగాయి. ఈ సమయంలో చాలా మంది తల్లిదండ్రులు కాల్పుల్లో మృతి చెందారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ వారిని దత్తత తీసుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు