Srushti IVF Center: బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో, ఫుట్ పాత్‌లపై ఉన్న బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్టు తెలుస్తోంది. సృష్టి IVF సెంటర్ కేసు విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.

New Update
Srishti Test Tube Baby Center

Srushti IVF Center

Srushti IVF Center:

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్(Test Tube Baby Center) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి IVF సెంటర్ సరోగసీ పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ రేటుకు కొని.. సంతానం లేని వారికి లక్షల్లో అమ్ముకున్న విషయం తెలిసిందే. సృష్టి నిర్వాహకుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సికింద్రాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ ఫుట్ పాత్‌లపై ఉన్న బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్టు తెలుస్తోంది. పోర్న్ వీడియోలు చూపించి వారికి నుంచి వీర్యం తీసుకునేవారని అనుమానాలు ఉన్నాయి.

Also Read: ఎంతకు తెగించార్రా.. బిడ్డను కొనుక్కొచ్చి నాటకం - ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్' కేసులో సంచలన నిజాలు..

దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు.. సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్, సరోగసీ కేసుల రికార్డులు(Surrogacy Cases Records), ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 మంది దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. ఈ అక్రమ సరోగసీ, శిశువులను అమ్మే వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. ఈ వ్యవహారంపై ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

ఐవీఎఫ్, సరోగసీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు సిటీలో కూకట్​పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే, ఏపీలోని విజయవాడ, వైజాగ్ తో పాటు ఒడిశా, కోల్​కతాలోనూ బ్రాంచీలు ఉన్నట్లు సమాచారం. వీర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లు, అమాయకులను ముందుగా గుర్తించేవాళ్లు. వారికి డబ్బులు, బీరు, బిర్యాని ఆఫర్ చేస్తూ వీర్యం సేకరించేవారు.

Also Read: వీర్యదానం చేస్తున్నారా?  క్లినిక్‌లపై పోలీసుల దాడులు

సిగ్గుపడేవాళ్లకు సెపరేట్‌గా పోర్న్ వీడియోలు చూపించి.. వీర్యం కలెక్ట్ చేసేవారని తెలిసింది. మరోవైపు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థపై(Sperm Tech Company) పోలీసులు దాడులు చేశారు. నాలుగేండ్ల కింద సికింద్రాబాద్‌లో ప్రారంభించిన ఈ సంస్థకు.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌తో సంబంధాలు ఉన్నాయి. స్పెర్మ్​ దానం(Sperm Donation) చేయాలని నిర్వాహకులు ప్రచారం చేసేవాళ్లు. వందలాది మంది నుంచి వీర్యం, అండాలు సేకరించినట్లు సమాచారం. రోజువారీ కూలీలు, పేదరికంతో బాధపడుతున్న దంపతులు, యువకుల నుంచి సేకరించినట్టు తెలుస్తున్నది. వీర్యం ఇస్తే రూ.800 నుంచి రూ.4వేల వరకు ఇచ్చేవాళ్లు. వీరికి కూడా పోర్న్ వీడియోలు చూపిస్తూ శాంపిల్స్ సేకరించేవారని సమాచారం. అండం ఇచ్చే మహిళలకు రూ.10 వేల నుంచి రూ.25వేల వరకు ఇచ్చేవారని తెలుస్తున్నది. ఇలా సేకరించిన వీర్యం, అండాలను అహ్మదాబాద్‌కు తరలించేవాళ్లు.

Advertisment
తాజా కథనాలు