/rtv/media/media_files/2025/07/29/divya-deshmukh-prize-money-2025-07-29-10-50-29.jpg)
Divya Deshmukh prize money
FIDE Women's World Cup 2025:
19 ఏళ్ల భారత యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్(Divya Deshmukh Chess Player) 2025 ఫిడే మహిళల ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించారు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుపొందిన తొలి భారతీయ మహిళగా ఆమె ఘనత సాధించారు. అదే సమయంలో ఆమె భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్(GM Title) టైటిల్ సాధించిన నాలుగో మహిళగా, మొత్తంగా 88వ భారతీయ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచారు.
దివ్య ఏకంగా తన సీనియర్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిని ఓడించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. జార్జియాలోని బటూమిలో జరిగిన ఈ ఫైనల్.. రెండు క్లాసికల్ గేమ్‌లు డ్రా అవ్వడంతో టైబ్రేక్‌లకు దారితీసింది. ఈ టైబ్రేక్‌లలో దివ్య తన అసాధారణ నైపుణ్యాన్ని, మానసిక ధైర్యాన్ని ప్రదర్శించి.. 1.5-0.5 స్కోరుతో విజయం సాధించింది.
దివ్య దేశ్‌ముఖ్ ప్రైజ్ మనీ (Divya Deshmukh Prize Money)
విజయం సాధించిన భారత చెస్ సంచలనం దివ్య దేశ్‌ముఖ్‌కు(Divya Deshmukh) భారీ ప్రైజ్ మనీ లభించింది. ఆమెకు $50,000 ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.41.6 లక్షలకు సమానం. ఇది కేవలం ఆర్థిక బహుమతి మాత్రమే కాకుండా.. ఆమెకు స్వయంచాలకంగా గ్రాండ్‌మాస్టర్ (GM) టైటిల్ కూడా లభించింది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన కోనేరు హంపికి $35,000 (సుమారు రూ.29.1 లక్షలు) లభిస్తుంది.
ఇదిలా ఉంటే 2025 ఫిడే మహిళల ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ పూల్ $691,250గా నిర్ణయించారు. దీనిని టోర్నమెంట్‌లోని వివిధ దశల్లో 107 మంది ఆటగాళ్లకు ఇవ్వనున్నారు. ఇందులో విన్నర్, రన్నరప్‌కు అత్యధిక వాటా లభిస్తుంది. మిగతా వారికి వారి ప్రదర్శన ఆధారంగా ప్రైజ్ మనీ చెల్లిస్తారు. మొదటి రౌండ్‌లో ఓడిపోయిన ఆటగాళ్లకు $3,750 చొప్పున ఇస్తారు. క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్న వారికి $14,000 చొప్పున చెల్లిస్తారు.