/rtv/media/media_files/2024/12/31/0j2EHuGYyqzn3WyhEibx.jpg)
Nimisha Priya
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ ప్రభుత్వం విధించిన ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్లు ఇటీవల భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, నిమిష ఉరిశిక్ష రద్దు కాలేదని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు తాజాగా తెలిపాయి.
ఇది కూడా చూడండి:బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!
జాబ్ కోసం వెళ్లి..
ఇదిలా ఉండగా నిమిష ప్రియ కేరళలో నర్సింగ్ కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్‌కు వెళ్లి అక్కడే జాబ్‌లో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత యెమెన్‌లోని ఓ క్లినిక్‌ను ప్రారంభించాలనుకుంది. అయితే ఆ దేశ రూల్స్ ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం నిమిష అక్కడున్న తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వీళ్లద్దరూ కలిసి మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నిమిష తన కూతురు సంప్రదాయ వేడుక కోసం భారత్‌కు వచ్చింది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: నిమిష ప్రియా ఉరిశిక్ష రద్దు
అది ముగిశాక యెమెన్‌కు వెళ్లిపోయింది. నిమిష భర్త, కూతురు మాత్రం కేరళలోనే ఉండిపోయారు. దీన్ని ఆసరగా చేసుకొని మెహది.. నిమిష ప్రియ నుంచి డబ్బు లాక్కునేవాడని, వేధించేవాడని ఆమె కుటుంబం ఆరోపించింది. ఆఖరికి ఆమె పాస్‌పోర్టును కూడా లాక్కున్నాడని చెప్పారు. దీంతో నిమిష.. తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకునేందుకు 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చింది. కానీ డోస్ ఎక్కువైపోవడంతో అతడు మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని ఆమె వాటర్ ట్యాంక్‌లో పడేసింది.
ఇది కూడా చూడండి:New York Firing: కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి
చివరికి ఆమె సౌదీకి వెళ్తుండగా.. సరిహద్దుల్లో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించింది. అయితే మృతుడి ఫ్యామిలీకి కొంత మొత్తాన్ని పరిహారంగా ఇస్తే దోషులను క్షమించి వదిలేసే అవకాశం యెమెన్‌లో ఉంది. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నిమిష ప్రియ కుటుంబం మిలియన్ డాలర్లు అంటే రూ.8.6 కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.