Operation Sindoor 2.0 | ఆపరేషన్ సింధూర్ | India VS Pak War Updates | India Airstrikes | RTV
భారతీయ ఆర్మీ అధికారులు సంచలన ప్రకటన చేశారు. పాక్, పీఓకేలలో ఉత్తరంలోని సవాయ్ నాలా నుంచి దక్షిణాన బహవల్పూర్ వరకు 21 ప్రసిద్ధ శిక్షణా శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు. అందులో భారత్ 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది.
MIM అధినేత గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్‌పై ఫైర్ అయ్యారు. బిహార్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. అది ఫైయిలైన దేశమని, పాక్‌ను ఇక శిక్షించడమే మిగిలి ఉందని విమర్శలు గుప్పించారు.
భారత దేశాన్ని గర్వపడేలా చేసిన 'ఆపరేషన్ సిందూర్' పై సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు కురిపిస్తున్నారు. చిరంజీవి, మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, విజయ్ దేవరకొండ, రితేష్ దేశముఖ్ తదితరులు 'ఆపరేషన్ సిందూర్' కి మద్దతుగా ట్వీట్లు చేశారు.
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఫైటర్ జెట్లలో నుంచి ఉగ్రవాద స్థావరాలను ఎలా టార్గెట్ చేసి దాడులు చేశారనేది ఇందులో ఉంది. ఆపరేషన్ సంబంధించిన వివరాలతో వీడియోలను ఆర్మీ ఎక్స్‌లో విడుదల చేసింది.
ఆపరేషన్ సిందూర్ అటాక్ తర్వాత పాకిస్తానీ టీవీ యాంకర్ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమాయకులను చంపేస్తున్నారు, దేవుడా నువ్వే కాపాడు అంటూ కన్నీరు పెట్టుకుంది. మేము మానవులంతా ఒక్కటేనన్న విషయాన్ని మరచిపోయామని తెలిపింది.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌ఫుల్‌గా విజయవంతమైంది. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన మెరుపుదాడులతో పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.