భారత్-పాకిస్థాన్‌సరిహద్దుల్లో తరచుగా దాడులు జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఆర్మీ జవాన్లు ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాటం చేస్తుంటారు. అయితే తాజాగా ఆర్మీ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో సుమారు 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులను హతమార్చామని పేర్కొన్నారు. 2024లో ప్రతి ఐదురోజులకు ఒక ఉగ్రవాదిని.. అంటే మొత్తంగా 75 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టామని చెప్పారు. వీళ్లలో అధికంగా 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులే ఉన్నట్లు వెల్లడించారు. Also Read: రాబోయే రోజుల్లో AIతో మానవాళికి ముప్పు: గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ ఆర్మీ అధికారుల నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జమ్మూ ప్రాంతంలోని ఐదు జిల్లాలైన ఉధంపూర్, కథువా, దోడా, జమ్మూ, రాజౌరిలో 42 మంది మరణించారు. వీళ్లలో ఎక్కువమంది స్థానికేతర ఉగ్రవాదులు ఉన్నారనే విషయం బయటపడింది. స్థానికేతర కశ్మీర్ లోయలో బారాముల్లా, బందిపొరా, కుల్గాం, కుప్వారా జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. బారాముల్లా జిల్లాలో అత్యధికంగా తొమ్మిది ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ దాడిలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు మరణించారు. Also Read: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో 17 మందిని, జమ్మూకశ్మీర్ అంతర్గత ప్రాంతాల్లో 26 మందిని భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. మరోవైపు తీవ్రవాద కార్యకలాపాలు పెరగకుండా అడ్డుకునేందుకు భారత భద్రత బలగాలు కీలక పాత్ర పోషించాయి. అయితే జమ్మూకశ్మీర్‌లో ఉన్న స్థానిక ఉగ్రవాదుల సంఖ్య చాలావరకు తగ్గిందని ఓ అధికారి తెలిపారు. కానీ పాకిస్థానీ ఉగ్రవాదులు మాత్రం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఇక 2024లో జమ్మూకశ్మీర్‌లో 60 ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా దళాల సిబ్బంది, తీవ్రవాదులతో సహా మొత్తం 122 మంది చనిపోయారు. Also Read: దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం! Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్