పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓజీ' (OG) ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనగా, తాజాగా నిర్మాణ సంస్థ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ కీలక ప్రకటన చేసింది. " దయచేసి పవన్ కళ్యాణ్ ను పెట్టకండి" అంటూ విజ్ఞప్తి చేసింది. 'OG' సినిమా పై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాము. OG సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు పాలిటికల్ సభలకు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా 'OG', 'OG' అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. Aaayanni Ibbandhi Pettakandraaa… Inkonchem time undhi…. Allaaadiddaam Theatres lo..#TheyCallHimOG #OG #FireStormIsComing pic.twitter.com/AjegAndqAh — DVV Entertainment (@DVVMovies) December 28, 2024 Also Read: నాగార్జునాసాగర్ దగ్గర హై డ్రామా..భద్రత విషయంలో గందరగోళం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025-00 పండుగ వైభవంగా నిలుస్తుందని మేము. గట్టిగా నమ్ముతున్నాం." అని నిర్మాణ సంస్థ తన ప్రకటనలో స్పష్టం చేసింది. Pavan kalyan banging his own fans is an absolute cinema 🤣🤣pic.twitter.com/OjUNGx1u0g — 𝘴ꪖ𝓲𝘬𝓲𝘳ꪖꪀ ᴰʳᵃᵍᵒⁿ ᴹᵃʰᵃʳᵃᵃʲ 🦁 🐉 🪓 (@Kiran_Holicc) December 28, 2024 ఫ్యాన్స్ పై పవన్ ఆగ్రహం.. ఈ ప్రకటనకు కారణం లేకపోలేదు. ఇటీవల, గాయపడి చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ కడప రిమ్స్‌కి వెళ్లిన సమయంలో ఓ సంఘటన జరిగింది. ఆయన దాడి ఘటనపై మీడియాతో సీరియస్‌గా మాట్లాడుతున్న తరుణంలో అభిమానులు "ఓజీ ఓజీ" అంటూ అత్యుత్సాహంతో నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన పవన్ అసహనంతో, "ఏంటయ్యా మీరు! ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదా? పక్కకు జరగండి" అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. Also Read: కేటీఆర్ కోసం పాట పాడిన కొడుకు..ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్