రాబోయే రోజుల్లో AIతో మానవాళికి ముప్పు: గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ

రాబోయే మూడు దశాబ్దాల్లో ఏఐ వల్ల మానవ మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశాలు 10 నుంచి 20 శాతం ఉన్నాయని ఏఐ గాడ్‌ఫాదర్ జెఫ్రీ హింటన్ అన్నారు. ఏఐ భద్రతకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణ ముఖ్యమని తెలిపారు.

New Update
Professor Geoffrey Hinton

Professor Geoffrey Hinton

అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఏఐకి గాడ్ ఫాదర్‌గా పిలుచుకునే బ్రిటిష్-కెనడియన్ కంప్యూటర్ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే మూడు దశాబ్దాల్లో ఏఐ వల్ల మానవ మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశాలు 10 నుంచి 20 శాతం ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల బీబీసీ రేడియో 4కి చెందిన టూడే ప్రొగ్రామ్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. గతంలోనే ఈయన రాబోయే రోజుల్లో  ఏఐతో 10 శాతం ముప్పు ఉందని అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాను 20 శాతానికి పెంచారు. 

Also Read: దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం!

అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ వల్ల సంభవించే ముప్పు గురించి మీ అంచనాలో ఏదైనా మార్పు ఉందా అని అడగగా.. అది 10 నుంచి 20 శాతానికి పెరగిందని హింటన్ సమాధానమిచ్చారు. అంతేకాదు ఏఐ వ్యవస్థలను తల్లిగా.. వాటిని నియంత్రించే మానవులను పిల్లలతో పోల్చారు. 2023లో గూగుల్‌ సంస్థ నుంచి హింటన్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. నియంత్రణ లేని ఏఐ వల్ల భవిష్యత్తులో పొంచి ఉన్న ముప్పు గురించి స్వే్చ్ఛగా మాట్లాడేందుకు ఆయన ఆ సంస్థ నుంచి వెళ్లిపోయారు. గతంలో ఏఐతో ఉన్న ప్రమాదాలపై ఆయన చెప్పిన విషయాలు సంచలనం రేపాయి. 

 Also Read: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్డౌన్

 రాబోయే 20 ఏళ్లలో అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ వ్యవస్థలు మనుషుల కన్నా మరింత తెలివిగా మారుతాయని ఏఐ నిపుణులు అంచనాలపై హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధి తాను ఊహించిన దానికన్నా చాలా వేగంగా ఉందని.. దీనిపై కచ్చితంగా ప్రభుత్వ నియంత్రణ  ఉండాలని చెప్పారు. లాభాల కోసం నడిచే బడా కంపెనీలు ఏఐ అభివృద్ధికి సంబంధించి జాగ్రత్తలు పట్టించుకోవని అన్నారు. ఏఐ భద్రతకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణే ముఖ్యమని పేర్కొన్నారు.  

Also Read: దారుణం.. తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు పోలీసులు మృతి..!

Also Read: ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ వచ్చేస్తోంది!

Advertisment
తాజా కథనాలు