Bullet Train: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ

గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సీఆర్‌ 450 బుల్లెట్‌ రైలును చైనా ఆవిష్కరించింది. ఈ రైలును ఆదివారం బీజింగ్‌లో పరీక్షించారు. ఇది వాడుకలోకి వచ్చే సమయానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల వాణిజ్య రైలుగా నిలుస్తుందని చైనా రైల్వేశాఖ పేర్కొంది.

New Update
CR450 high-speed train

CR450 high-speed train

చైనా మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సీఆర్‌ 450 ప్రొటోటైప్ బుల్లెట్‌ రైలును ఆవిష్కరించింది. ఈ రైలును ఆదివారం బీజింగ్‌లో పరీక్షించారు. ఈ రైలు డిజైన్‌ చాలా నాజుగ్గా, బుల్లెట్‌ షేప్ ముక్కుతో ఉంటుందని చైనా రైల్వేశాఖ తెలిపింది. ఇది గంటలు 450 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని చెప్పింది. ఇది వాడుకలోకి వచ్చే సమయానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల వాణిజ్య రైలుగా నిలుస్తుందని పేర్కొంది.   

Also Read: నూతన సీఎస్‌గా ఆయనే.. ఫైనల్ చేసిన సీఎం చంద్రబాబు!

గతంలో బీజింగ్ నుంచి షాంఘైకి రైలులో వెళ్లాలంటే నాలుగు గంటల సమయం పట్టేది. అయితే ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా కేవలం 2.5 గంటల్లోనే గమ్యానికి చేరుకోవచ్చు. చైనాలో హైస్పీడ్‌ రైలు వ్యవస్థ మొత్తం 45 వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే సీఆర్‌ 450 ప్రొటోటైప్‌ను డిసెంబర్‌లో పరీక్షిస్తామని ప్రకటించింది. చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 

Also Read: దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం!

ఈ ప్రాజెక్టు కింద హైస్పీడ్ రైళ్లు, వంతెనలు, ట్రాక్‌లు, సొరంగాలను నిర్మించనున్నారు. అయితే సీఆర్ 450 బుల్లెట్‌ రైలు 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతం ఉన్న సీఆర్‌ 400 మోడల్ కంటే ఇది 12 శాతం తక్కువ. అంతేకాదు విద్యుత్తును కూడా ఇది 20 శాతం తక్కువగానే వినియోగిస్తుంది. గత మోడల్ కంటే 50 కి.మీ ఎక్కువగా ప్రయాణం చేయగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఇదిలాఉండగా.. రెండు రోజుల క్రితమే చైనా ఆరో తరానికి చెందిన జే-36 యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. సిచువాన్‌ ప్రావిన్స్‌లో చెంగ్డూలో దీన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్-35, ఎఫ్-22 రాప్టర్లను కూడా సవాలు చేయగలదని చెబుతున్నారు. 

Also Read: తల్లి మొబైల్ చూడవద్దని చెప్పడంతో.. కూతురు ఏం చేసిందంటే?

Also Read: ఒకే వాట్సాప్‌ నంబర్‌..ఇక నుంచి రెండు ఫోన్లలో..!

Advertisment
తాజా కథనాలు