Covid-19: బెంగళూరులో 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్

బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. ప్రస్తుతం చిన్నారి బెంగళూరులోని కలాసిపాలయలోని వాణి విలాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

New Update
positive 9 months

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  కేరళ, ముంబైలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. మే 22న రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) ద్వారా చిన్నారికి ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం చిన్నారి బెంగళూరులోని కలాసిపాలయలోని వాణి విలాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూ రావు మే 21వ తేదీ నాటికి రాష్ట్రంలో 16 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయని తెలిపారు.

Also Read :  బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు హార్ట్‌ఎటాక్‌

Also Read  :  ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

భారత్ లో 257 కేసులు

ఇక భారత్ లో  మే 19 నాటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 257కి చేరుకుంది.  కరోనా మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం అలర్ట్ అయింది.  ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఇన్ఫ్లుఎంజా, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కేసులను నిశితంగా పరిశీలించాలని ఆదేశించింది. అలాగే పబ్లిక్ కూడా కీలక సూచనలు చేసింది.  పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ ధరించాలని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో సామాజిక దూరాన్ని పాటించాలని సూచించింది. కరోనా లక్షణాలుంటే- వెంటనే డాక్టర్ ను  సంప్రదించాలని తెలిపింది. 

Also Read :  మెదక్ జిల్లా పేరు వింటే.. నాకు ఆమె గుర్తుకు వస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

Also Read :  ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు

covid 19 positive | national news in Telugu | breaking news in telugu | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు