మెదక్ జిల్లా పేరు వింటే.. నాకు ఆమె గుర్తుకు వస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

జహీరాబాద్ బహిరంగసభలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిదని ఆయన అన్నారు. మెదక్ పేరు గుర్తొస్తేనే ఇందిరమ్మను తలచుకుంటామని తెలిపారు.

New Update

జహీరాబాద్ బహిరంగసభలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిదని ఆయన అన్నారు. మెదక్ పేరు గుర్తొస్తేనే ఇందిరమ్మను తలచుకుంటామని తెలిపారు. అలాగే ఇందిరమ్మ గుర్తొచ్చిన ప్రతీసారి మెదక్‌ని తలుచుకుంటామని ఆయన వివరించారు. ఇందిరమ్మ తన చివరి రోజుల్లో మెదక్ ఎంపీగా కొనసాగారని గుర్తించేశారు. గత ప్రభుత్వ హయాంలో నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. 

Also read: BIG BREAKING : బెంగళూరులో 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచాం, భూసేకరణను వేగవంతం చేశామని చెప్పుకొచ్చారు. త్వరలో హ్యుందాయ్ కార్ల తయారీ కంపెనీ ఇక్కడ పనులు ప్రారంభిస్తోందని చెప్పారు. నిమ్జ్ భూ నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కుటుంబాలకు భోజనాలు పెట్టి ఇండ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగించారు. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. అభివృద్ధిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజా పాలనలో రైతు భరోసాను రూ.12 వేలకు పెంచామని, భూమిలేని పేదలకూ భరోసా అందిస్తున్నామని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభకు రావాలని ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. 

Also read: MP Raghunandan Rao: కవిత లేఖ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీనా?

Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు