Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం

బళ్లారిలో గాలి జనార్థన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్‌ రెడ్డి అనుచరుడు ఆయనపై కాల్పులు జరిపాడు. 8 రౌండ్ల వరకు కాల్పులు జరపగా ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. గాలి జనార్ధన్ రెడ్డి ఈ కాల్పుల నుంచి తప్పించుకుని బయటపడ్డారు.

New Update
Gali Janardhan reddy

Gali Janardhan reddy

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి(gali-janardhan-reddy) పై హత్యయత్నం(murder-attempt) జరిగింది. ఎమ్మెల్యే భరత్‌ రెడ్డి అనుచరుడు ఆయనపై కాల్పులు జరిపాడు. 8 రౌండ్ల వరకు కాల్పులు జరపగా ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు మృతి చెందారు. గాలి జనార్ధన్ రెడ్డి ఈ కాల్పుల నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఎదురుకాల్పుల్లో సతీష్‌ రెడ్డి బుల్లెట్ గాయం అయ్యింది. జనార్థన్‌ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడంపై వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. బళ్లారి సర్కిల్‌లో జనవరి 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉంది. దీంతో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి అనుచరులు ఆ ప్రాంతంలో ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. అయితే జనార్థన్‌ రెడ్డి ప్రహరీకి కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నంలోనే గొడవ జరిగినట్లు సమాచారం. 

ఈ ఘర్షణలో కాంగ్రెస్(congress) కార్యకర్తలు గాయపడటంతో ఎమ్మెల్యే భరత్‌ రెడ్డి రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇరు వర్గాల మధ్య గొడవ మరింత చెలరేగింది. ఒకరిపై మరొకరు రాళ్లు, బీరు సీసాలతో విసురుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కూడా గొడవను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఎవరూ ఆగలేదు. చివరికి ఎస్పీ ఆదేశాలతో వారు గాల్లోకి కాల్పులు జరిపడంతో గొడవ సద్ధుమణిగింది.   

Also Read :  న్యూఇయర్ వేళ పాక్ ఉగ్రకుట్ర.. డ్రోన్లతో పేలుడు పదార్థాలు సరఫరా

Murder Attempt On Gali Janardhan Reddy

ఈ ఘటన తర్వాత గాలి జనార్ధన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి, ఆయన కొడుకు ఎమ్మెల్యే భరత్‌రెడ్డికి నేర చరిత్ర ఉందన్నారు. గత 25 ఏళ్ల నుంచి వారు రౌడీయిజం చేస్తున్నా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చామన్నారు. వాళ్ల చుట్టూ హత్యలు చేసినా గుండాలను పెట్టుకున్నారంటూ ఆరోపించారు. 

Also Read :  స్వతంత్రం వచ్చి 78 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఆ ఊరికి రోడ్డు

Advertisment
తాజా కథనాలు