/rtv/media/media_files/2026/01/02/pakistan-2026-01-02-11-16-30.jpg)
Explosives, Ammunition Dropped By Pak Drone Recovered Near Line Of Control
కొత్త సంవత్సరం(New Year 2026) వేళ ప్రపంచ దేశాలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోగా పాకిస్థాన్(pakistan) మాత్రం తన దొంగబుద్ధిని మాత్రం వదలలేదు. జనవరి 1న జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌కు డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రిని పంపించింది. వీటికి సంబంధించిన ప్యాకెట్లను కింద జారవిడించింది. ఈ విషయం తెలుసుకున్న భారత సైనికులు చర్యలకు దిగారు. ప్రస్తుతం పూంచ్ జిల్లాలో భద్రతా దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
Also Read: కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన.. ఈ ఏడాదికి మరో 12 వందేభారత్ రైళ్లు
Pak Drone Recovered Near Line Of Control
డ్రోన్ల ద్వారా పంపించిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఏ ఉగ్ర సంస్థ ఉందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అయితే గత 24 గంటల్లో భారత్-పాక్ సరిహద్దు దగ్గర్లో డ్రోన్ కనిపించడం ఇది రెండోసారి కావడం కలకలం రేపుతోంది. ఇంతకుముందు సాంబలోని ఫుల్పూర్‌లో అనుమానస్పదంగా డ్రోన్ కనిపించింది. కొద్దిసేపు భారత భూభాగంలోనే ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయింది. డ్రోన్ కార్యకలాపాలు గమనించిన సైన్యం రంగంలోకి దిగింది.
Also Read: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. యూనస్‌పై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
తాజాగా డ్రోన్లతో పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రిని పంపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్థాన్ మళ్లీ భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్, పీఓకేలోని ఉగ్రశిబిరాలపై కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో చాలామంది ఉగ్రవాదులు చనిపోయారు. దీంతో అక్కడి ఉగ్ర సంస్థలు మళ్లీ భారత్‌పై అటాక్ చేసేందుకు ప్లాన్లు వేస్తున్నట్లు తెలస్తోంది.
Follow Us