Delhi: అధికారుల ముందు కోరికల చిట్టా ఉంచిన రాణా!

ముంబయి 26 /11 దాడుల కుట్రదారు తహవూర్ రాణాను భారత్‌ కు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. 24 గంటల నిఘా నీడలో ఉన్న రాణా.. తనకు కొన్ని వస్తువులు కావాలని అధికారులను కోరాడు. ఖురాన్, పెన్ను, పేపర్ వంటి ఇవ్వాలని అధికారులను అభ్యర్థించాడు.

New Update
Tahawwur Rana With NIA Officials

Tahawwur Rana With NIA Officials

ముంబయి ఉగ్రదాడుల కుట్రదారుడైన తహవూర్ హుస్సేన్ రాణా..  జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. 24 గంటల నిఘా నీడలో ఉన్న రాణా.. తనకు కొన్ని వస్తువులు కావాలని అధికారులను కోరాడు. ముఖ్యంగా ఖురాన్ , పెన్ను, పేపర్ వంటి ఇవ్వాలని అధికారులను అభ్యర్థించాడు. అతడికి అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పినప్పటికీ.., ఖురాన్ ని నమాజ్ కోసం ఉపయోగించాడని అధికారులు తెలిపారు.

Also Read:Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

అవరసమైన వస్తువులను అతడికి అందించనప్పటికీ రాణా ప్రతీ చర్యను సునిశితంగా గమనిస్తున్నారు. అతడు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.కాగా, ముంబయి దాడుల ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పెద్ద సంఖ్యలో జరిగిన ఫోన్ కాల్స్‌ డేటా సహా దర్యాప్తు సంస్థ సేకరించిన వివిధ సాక్ష్యాల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. తహవూర్ రాణాకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారులతో అనుమానాస్పద సంబంధాలు, దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో  అతడి అనుబంధంపై ప్రశ్నిస్తున్నారు.

Also Read: South Central Railway: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !

ముంబయిలో పనిచేయని ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని నిర్వహించడానికి నిధులను ఎలా సమకూర్చాడనే దానిపై ఎన్‌ఐఏ విచారణ జరుపుతుంది. 2006,-2009 మధ్య డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ నిఘా కార్యకలాపాలకు ఇది ఓ కేంద్రంగా ఉంది. పాకిస్థాన్ హ్యాండ్లర్లతో అతడి సమావేశాలు, మెయిల్ సంభాషణల గురించి కూడా NIA అతడ్ని విచారిస్తోంది.

2005లో డేవిడ్ హెడ్లీని భారత్‌లో గూఢచర్యం నిర్వహించమని లష్కరే తొయిబా ఆదేశించినప్పటి నుంచి జరిగిన కుట్రను ఈ విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు. ముంబయి ఉగ్రదాడులు ప్రణాళికల గురించి తెలిసిన దుబాయ్‌లోని రహస్య సాక్షి సహా అతడు కలిసిన ఇతర వ్యక్తుల గురించి కూడా రాణాను ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి.

దేశ ఆర్థిక రాజధానిలో దాడులకు కొన్ని రోజుల ముందు ఉత్తర, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రాణా ప్రయాణాలు కీలక ఆధారాలు అందజేస్తాయని NIA అధికారులు ఆశిస్తున్నారు.‘ తహవూర్ రాణా 18 రోజుల పాటు NIA కస్టడీలో ఉంటాడు. ఆ దాడుల్లో మొత్తం 166 మంది మరణించారు.. 238 మందికి పైగా గాయపడ్డారు’ అని శుక్రవారం తెల్లవారుజామున కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

rana | delhi | mumbai | attacks | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | Tahawwur Rana

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు