ఇటీవల మహారాష్ట్రలో మహాయుతి కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన సంచలన దూమారం రేపుతోంది. 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుందో లేదో అనేది తనకు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. సంజయ్ రౌత్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ '' 2026 తర్వాత కేంద్రం మనగుడ సాగిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. ప్రధాని మోదీ తన పదవీకాలం పూర్తయ్యేవరకు ఉండకపోవచ్చు. Also Read: రైతులకు శుభవార్త.. పంట బీమా పథకాలను పొడిగించిన కేంద్రం కేంద్రంలో అస్థిరత ఏర్పడితే మహారాష్ట్రలో కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు శివసేన (UBT) పార్టీకి చెందిన రాజన్ సాల్వీ పార్టీ నుంచి వెళ్లిపోతారనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయనే భయంతో చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. అలాగే దర్యాప్తు సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడని వ్యక్తులతో పార్టీ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని'' సంజయ్ రౌత్ అన్నారు. Also Read: బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి ఇదిలాఉండగా.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై కూడా సంజయ్ రౌత్ తీవ్రంగా విమర్శలు చేశారు. ఏక్‌నాథ్ షిండేకు తన సొంత పార్టీపైనే నియంత్రణ లేదని సెటైర్లు వేశారు. పార్టీపరంగా షిండే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు. బాలాసాహెబ్ సిద్ధాంతాలతో పనిచేస్తున్న శివసేన (UBT) పార్టీ విధానాలు ఇలాంటి వాటికి పూర్తిగా విరుద్ధమని తేల్చిచెప్పారు. మాకు ఎవరిముందు తలవంచాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. Also Read: న్యూఇయర్ రోజు అమెరికాలో మరో అటాక్..న్యూయార్క్ నైట్ క్లబ్‌లో కాల్పులు.. Also Read: ఒకే రోజు 16 సూర్యోదయాలు చూసిన సునీతా విలియమ్స్