PM Modi: రైతులకు శుభవార్త.. పంట బీమా పథకాలను పొడిగించిన కేంద్రం

రైతులకు పంటల బీమా పథకాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు నష్టం తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ పథకాలను పొడిగించనున్నట్లు తెలిపింది. ఈ పథకంలో 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రైతులకు రూ.1,350కు ఇవ్వనుంది.

New Update
farmers-RTV

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పంటల బీమా పథకాలను రైతులకు మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల రైతులకు నష్టం తగ్గుతుందని కేంద్రం తెలిపింది. ప్రధాన మంత్రి మేదీ నేతృత్వంలో బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం కాలానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పథకాలకు రూ.824.77 కోట్ల కార్పస్‌తో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రైతులకు రూ.1,350కు ఇవ్వడానికి రూ.3,850 కోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఇది కూడా చూడండి: AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

పెట్టుబడి సాయంగా..

ఇదిలా ఉండగా న్యూ ఇయర్ సందర్భంగా సందర్భంగా ప్రధాని మోదీ రైతులకు కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సాయంగా మోదీ రూ.6 వేలు ఇస్తున్నారు. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఇకపై ఈ పెట్టుబడి సాయాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు మోదీ వెల్లడించారు. ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు వారికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి:Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది విడుదల చేసే 2025-2026 బడ్జెట్‌లో దీని గురించి ప్రకటించనున్నారు. ఆరేళ్ల క్రితం ప్రారంభించిన కిసాన్ నిధి పథకం ద్వారా ఎందరో రైతులకు సాయం చేయడం వల్ల వారికి బాగా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 18 వాయిదాలు చెల్లించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ వాయిదాలను జమ చేయనుంది. ఈ క్రమంలో మోదీ పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చూడండి: RJ:బోర్‌‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి

ఇది కూడా చూడండి:TS: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు