భారత మూలాలు గల అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ గత కొన్ని నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకు పోయారు. అయితే ఆమె ప్రస్తుతం అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో సురక్షితంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు అక్కడే జరుపుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆమె ప్రతి రోజు దాదాపు 16 సార్లు సూర్యోదయాలు చూస్తున్నట్లు సమాచారం.
Also Read: Tirumala: కియోస్క్ మెషిన్ ప్రారంభం.. డబ్బులు లేకపోయినా పర్లేదు
ఈ నేపథ్యంలోనే సునీతా విలియమ్స్ తో పాటు అక్కడ ఉన్న అందరూ వ్యోమగాములు న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1, 2025న 16 సూర్యోదయాలు చూశారు. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత, వ్యోమగామి అయిన సునీతా విలియమ్స్ ప్రస్తుతం నాసా ‘ఎక్స్‌పెడిషన్ 72’ కి కమాండర్ గా ఉన్న విషయం తెలిసిందే.
Also Read: Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా..
16 సార్లు సూర్యుడు ఉదయించడం..
స్పేస్ స్టేషన్ లో ప్రస్తుతం ఆమెతో పాటు బుచ్ విల్మోర్, డాన్ పెటిట్, అలెక్సిలీ ఓవ్‌చినిన్, అలెక్సాండర్ గోర్బునోవ్, నిక్ హేగ్ లాంటి స్పేస్ ఫ్లైట్ ఇంజినీర్లు కూడా ఉన్నారు. వీరంతా ఎక్స్‌పెడిషన్ 72 సిబ్బంది. “2024 సంవత్సరం ముగిసింది. అంతరిక్షంలో ప్రతిరోజూ లాగే ఎక్స్‌పెడిషన్ 72 సిబ్బంది ఈ రోజు కూడా న్యూ ఇయర్ సందర్భంగా 16 సార్లు సూర్యుడు ఉదయించడం, 16 సార్లు అస్తమించడాన్ని ఆస్వాదించారు. ఆర్బిటల్ అవుట్ పోస్ట్ లో ఉంటూ ఏళ్ల తరబడి నుంచి చాలా సూర్యాస్తమయాల చిత్రాలు తీయడం జరిగింది.” అని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ అధికారికంగా ఎక్స్ లో ట్వీట్ లోపేర్కొంది.
Also Read:Time Travel: రియల్ లైఫ్ టైమ్ ట్రావెలర్.. 2025 నుంచి 2024కు విమానం!
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ భూగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా ప్రతిరోజు దాదాపు 15.5 సార్లు తిరుగుతూంటుంది. అంటే గంటకు ఈ స్పేస్ స్టేషన్ 28,000 కిలోమీటర్లు తిరుగుతుంటుంది. ఈ స్పేస్ స్టేషన్ భూమికి 400 కిలో మీటర్ల ఎత్తులో అంతరిక్షంలో చిక్కుకుంది. ఒక్కసారి భూమిని చుట్టేయడానికి ఈ స్పేస్ స్టేషన్ కు దాదాపు 90 నిమిషాల సమయం పడుతుంది.
Also Read: Traffic Rules: 17,800 వాహనాలు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. రూ.89 లక్షల ఫైన్
సునీతా విలియమ్స్ తో పాటు మరో అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 2024లో అంతరిక్షంలోకి ప్రవేశించారు. వారిద్దరూ కేవలం 8 రోజుల్లో తిరిగి భూమికి రావాల్సి ఉండగా.. వారు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష విమానంలో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. దీంతో వారిద్దరూ అక్కడే కొన్ని రోజుల పాటు ఉండాలని నాసా చెప్పింది.
కానీ కొన్ని రోజులు కాస్తా ఇప్పుడు కొన్ని నెలలు అయిపోయింది. వారిని భూమిని తీసుకు వచ్చేందుకు ప్రస్తుతం మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష విమానం.. సాయం చేస్తోంది. వారు మరో మూడు నెలల తరువాత భూమికి తిరిగి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.