2025 మొదలవుతూనే అమెరికాకు బ్యాడ్ డేస్‌ను మోసుకొచ్చింది. న్యూ యర్ ఈవ్‌లో రెండు చోట్ల అటాక్స్ జరగడం ఆందోళనకు దారితీస్తోంది. న్యూ అర్లీన్స్‌లో పిక్ అప్ ట్రక్ జనాల మీదకు దూసుకెళ్ళడం, ఆతరువాత కాల్పులు జరపిన ఘటనలో 15 మంది చనిపోయారు మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి.ఇందులో నిందితుడు టెక్సాస్‌కు చెందిన షంషుద్దీన్ జబ్బార్ అమెరికన్ సిటిజెన్ అయిన్పటికీ ఉగ్రవాది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జబ్బార్‌ను ఐసీస్ లోన్ ఉల్ఫ్ కింద భావిస్తున్నారు. ఇతనికి సైనిక నేపథ్యం ఉన్నప్పటికీ ఉద్యోగం ఉంచి తొలగించబడ్డాడని చెబుతున్నారు. తన కుటుంబాన్ని కూడా న్యూ ఆర్లీన్ దాడిలో మట్టుబెట్టడానికి జబ్బార్ చూశాడని పోలీసులు తెలిపారు.
Also Read: UN: ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాక్
న్యూయార్క్‌లోనూ కాల్పులు..
ఇప్పుడు అదే రోజు ఇంచు మించు అదే సమయానికి న్యార్క్ లో జరిగిన మరో అటాక్ గురించి బయటకు వచ్చింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూ యార్క్‌లోని క్వీన్స్ లోని అమాజురా నైట్ క్లబ్‌లో సామూహిక కాల్పులు చేశారు. ఇందులో ఇప్పటి వరకు ఇద్దరు చనిపోగా దాదాపు 11 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. న్యా ర్లీన్స్ మాదిరిగానే ఈ ఘటనలో కూడ ఓకారుకుసంబంధం ఉందని అధికారులు చెబుతున్నారు. న్యూజెర్సీ ప్లేట్‌లతో కూడిన బూడిద రంగు ఇన్ఫినిటీ క్యూ50 సెడాన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
🚨 #BREAKING: MASS SHOOTING IN NEW YORK CITY
— Nick Sortor (@nicksortor) January 2, 2025
At least 11 people have been shot in Queens, NY at Amazura Night Club
This is still an ACTIVE situation. pic.twitter.com/HFYY0Cb3qZ
Also Read: Business: కొత్త ఏడాదిలో కొనుగోళ్ళు..కళకళలాడుతున్న మార్కెట్