జైపూర్‌లోని మూడేళ్ల చిన్నారి విగతజీవిగా మారింది. 150 అడుగుల బోరు బావి ఆమె ప్రాణాలను బలిగొంది. రాజస్థాన్‌లోని కోట్‌పూతలీ - బహరోడ్ జిల్లాలో చిన్నారి చేతన తన తండ్రితో కలిసి పొలానికి వెళ్ళింది. అక్కడ ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయింది. దాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది భారీ ఆపరేషను చేపట్టారు. మొదట హుక్‌అప్ టెక్నిక్‌తో పాపను తీయడానికి ప్రయత్నించారు. దాంట్లో కుదరలేదు. ఆ తరువాత ర్యాట్‌హోల్ మైనర్స్‌ను పిలిపించారు. పాలింగ్ మిషనుతో బోర్‌వెల్‌కు సమాంతరంగా 170 అడుగుల సొరంగం తవ్వారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు సమాంతరంగా చేతన పైపుల ద్వారా ఆక్సిజన్ లోపలికి పంపించారు. బాలిక కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వచ్చారు.
బండరాయి అడ్డురావడం వల్లనే..
అయితే బోరు బావిలో ఉన్న చేతనను చేరుకోవడానికి న్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి పది రోజులు టైమ్ పట్టింది. దారిలో పెద్ద బండరాయి అడ్డంగా ఉండడంతో దాన్ని తవ్వి తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో పాపను చేరుకోవడానికి పది రోజులు సమయం పట్టింది. నిన్న ఎట్టకేలకు పాపను ప్రాణాలతో బయటకు తీయగలిగారు. అయితే బయటకు వచ్చిన చేతన కొన్ని గంట్లోనే అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పదిరోజులుగా బోరుబాఇలో ఉండిపోవడం, సరైన ఆహారం లేకపోవడం...దానికి తోడు ఏం జరుగుతుందో తెలియని ట్రామా ఇవన్నీ పాప ప్రాణాలను బలిగొన్నాయి. అందువల్లే చేతన బయటకు సురక్షితంగా వచ్చిన సర్వైవ్ కాలేకపోయింది.