Python: వామ్మో.. మనిషిని మింగేసిన భారీ కొండచిలువ.. వీడియో వైరల్

ఇండోనేషియాలో ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. 26 అడుగుల భారీ కొండచిలువ ఏకంగా ఓ మనిషినే మింగేసింది. ఆగ్నేయ సువేసిలోని దక్షిణ బుటన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

New Update
Missing Indonesian Farmer Found Dead Inside Stomach Of Giant 26 Foot Python

Missing Indonesian Farmer Found Dead Inside Stomach Of Giant 26 Foot Python

ఇండోనేషియాలో ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. 26 అడుగుల భారీ కొండచిలువ ఏకంగా ఓ మనిషినే మింగేసింది. ఆగ్నేయ సువేసిలోని దక్షిణ బుటన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఓ రైతు ఉదయం తన పొలంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అతడు తిరిగి రాలేదు. అతడి కుటుంబ సభ్యులు ఎంత గాలించిన ఆచూరి దొరకలేదు. చివరికి ఆ రైతు పొలం సమీపంలో ఓ 26 అడుగుల భారీ కొండ చిలువను స్థానికులు గమనించారు. 

Also Read: ముంబై పేలుళ్ల కేసులో NIA ముందు రాణా సంచలన విషయాలు

Missing Indonesian Farmer

దాని పొట్ట భాగం ఉబ్బి ఉంది. అలాగే అది ఇబ్బంది పడుతోంది. దీంతో స్థానికులు అది ఏదో భారీ జంతువును మింగి ఉంటుందని భావించారు. దాన్ని చీల్చివేయగా.. కడుపులో రైతు మృత దేహాన్ని చూసి అక్కడివారు షాకైపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రాంతంలో ఓ కొండచిలువ మనిషిని మింగడం ఇదే తొలిసారని అక్కడివారు చెబుతున్నారు.

Also Read: ఛీ.. ఛీ.. ఇంటర్నెట్‌కు కూడా ఇబ్బందులు.. పాక్ నుంచి పారిపోతున్న కంపెనీలు!

ఇదిలాఉండగా 2017లో కూడా ఇండోనేషియాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ సమయంలో 23 అడుగుల భారీ కొండచిలువ ఉబ్బిపోయి కనిపించింది. దాన్న చీల్చి చూడగా అందులో 25 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని చూసి అక్కడి స్థానికులు కంగుతిన్నారు. ఇలాంటి భారీ కొండచిలువలు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో కనిపిస్తూనే ఉంటాయి. ఇవి తరచుగా చిన్న చిన్న జంతువులపై దాడులు చేస్తుంటాయి. అలాగే మనుషులను మింగేందుకు కూడా అరుదుగా ప్రయత్నిస్తుంటాయని అధికారులు చెబుతున్నారు.  

Also Read : ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని..

Also Read : 'అందులో తప్పేముంది'.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

indonasia | rtv-news | telugu-news | latest-telugu-news | international news in telugu | today-news-in-telugu | python-viral-video

Advertisment
Advertisment
తాజా కథనాలు