/rtv/media/media_files/2025/03/07/jx8pE61H9brqZHfoj9yD.jpg)
Tahawwur Rana Photograph: (Tahawwur Rana)
ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నారు. తహవ్వుర్‌ను ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా అతడు ముంబై ఉగ్రదాడి వెనుక తన పాత్రను అంగీకరించినట్లు తెలిసింది. ఢిల్లీ తీహార్ జైలులో ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న తహవ్వుర్ విచారణలో.. తాను పాకిస్థాన్ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్‌ను అని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను, తన స్నేహితుడైన డేవిడ్ హెడ్లీకి పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు కూడా అంగీకరించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్ర సంస్థ ప్రధానంగా గూఢచారి నెట్‌వర్క్‌గా పనిచేస్తుందని కూడా రాణా ఎన్‌ఐఏకి చెప్పినట్లు సమాచారం.
ముంబై పేలుళ్ల కేసులో రాణా ప్రధాన నిందితుడు. అతడు పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు డేవిడ్ కోల్‌మాన్ హెడ్లీతో తహవూర్ రాణాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ కలిసి ఉగ్రదాడికి ప్రణాళిక రచించారు. దాడి అనంతరం అమెరికాకు పారిపోయాడు. 2009లో రాణాను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అమెరికాలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న రాణాను అగ్రరాజ్యం ఇటీవలే భారత్‌కు అప్పగించింది.