Mamata Banerjee: త్వరలోనే నన్ను అరెస్ట్ చేసి జైళ్లో వేస్తారు.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్

బెంగాల్‌లో సుప్రీం కోర్టు తొలగించిన టీచర్లు CM మమతా బెనర్జీని కలిశారు. తాను బతికున్నంత వరకు వారి ఉద్యోగాలు ఎటూ పోవని మమతా హామీ ఇచ్చారు. ఇలా మాట్లాడినందున తనను జైల్లో వేసే అవకాశం ఉందని మమతా బెనర్జీ అన్నారు. అర్హులైన వారు నిరుద్యోగులుగా ఉండరని ఆమె అన్నారు.

New Update
mamata banerjee

mamata banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) టీఎంసీ(TMC) ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసిన 25 వేల టీచర్ల నియామకం రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విసయం తెలిసిందే. ఉద్యోగాలు పొందిన టీచ‌ర్లతో సోమవారం సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స‌మావేశం అయ్యారు. ఆమె బతికున్న వరకు వారి ఉద్యోగాలు ఎటూ పోవని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. 2016 పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ నియామకాల ద్వారా 25,752 స్కూల్ టీచర్లు నియమించబడ్డారు. ఆ నియామకంలో అవకతవకలు, అవినీతి జరిగిందని ఏప్రిల్ 3న సుప్రీం కోర్టు వాటిని రద్దు చేసింది. ఆ ఉపాధ్యాయులంతా ఏప్రిల్ 7న సీఎం మమతా బెనర్జీని కలిశారు. అర్హులైన వారు ఎట్టి పరిస్థితిలో ఉద్యోగాలు కోల్పోరని ఆమె వారికి హామీ ఇచ్చింది.

Also Read: Lady Aghori: ప్రభాస్ ఇంటి పక్క ఆ విల్లాపై అఘోరీ క్లారిటీ.. అది మాత్రమే నిజం

Also Read: Emergency Landing: ఇండిగో విమానంలో మహిళ మృతి

విషాదంతో త‌న గుండె రాయిలా మారింద‌ని, తాను మాట్లాడిన తీరు ప‌ట్ల ఆమెను జైలులో వేసే అవ‌కాశం ఉంద‌ని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎవ‌రైనా త‌న‌కు స‌వాల్ విసిరితే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో త‌న‌కు తెలుసు ఆమె చెప్పారు. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని, అర్హులైన అభ్యర్థుల ఉద్యోగాలు చేజార‌కుండా చూస్తాన‌ని ఆమె పేర్కొన్నారు. 2024 ఏప్రిల్‌ 22న కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. నియామకాలను రద్దు చేసిన ధర్మాసనం కొత్త నియామక ప్రక్రియను చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read: వారానికి 150 నిమిషాలు.. ఇలా చేయండి.. మీ మెదడు కత్తిలా షార్ప్‌!

Also Read: Gachibowli land dispute : కేటీఆర్, కిషన్‌రెడ్డిలకు బిగ్ షాక్.. త్వరలో విచారణకు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు