Gachibowli land dispute : కేటీఆర్, కిషన్‌రెడ్డిలకు బిగ్ షాక్.. త్వరలో విచారణకు!

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై  తప్పుడు, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు.  ఏఐ ఉపయోగించి తప్పుడు పోస్టులు పెట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు.  

New Update
ktr-kishan-reddy

ktr-kishan-reddy

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై  తప్పుడు, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు.  ఏఐ ఉపయోగించి తప్పుడు పోస్టులు పెట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు.  2025 ఏప్రిల్ 9, 10, 11న గచ్చిబౌలి పీఎస్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించారు.  

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై  తప్పుడు ప్రచారం చేసిన ప్రముఖులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం హైకోర్టును కోరింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్, కొణతం దిలీప్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ధ్రువ్ రాఠీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, రవీనా టాండన్, జాన్ అబ్రహాం, దియా మీర్జా మరికొందరు ప్రముఖులను విచారించనున్నట్లు సమాచారం.  

 

హైకోర్టులో విచారణ వాయిదా

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై 2025 ఏప్రిల్ 07వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.  ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజన్ బెంచ్.. కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది.  ప్రభుత్వం నుంచి సీనియర్‌ అడ్వకేట్‌గా మేనకా గురుస్వామి తన వాదనలు వినిపించారు.  కాగా కంచ గచ్చిబౌలి భూములలో పనులు ఆపేయలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.  తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. 

Also Read: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు