/rtv/media/media_files/2025/05/19/0N1u1GOVnxijlGqLlghu.jpg)
Best Mobile Offers
Best Mobile Offers: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ముఖ్యంగా కెమెరా పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, స్టైలిష్ లుక్, మంచి పనితీరు కావాలనుకుంటే ఈ ఫోన్లు మీకోసమే. ప్రముఖ బ్రాండ్లు అయిన Xiaomi, Realme, Vivo, iQOO, Oppo లాంటి కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. రూ.20వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
iQOO Z9x 5G - బడ్జెట్ లో స్టైలిష్ కెమెరా ఫోన్
రూ.10,499కే లభిస్తున్న ఈ ఫోన్ ధరకు తగిన ఫీచర్లు కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ కెమెరా సెటప్ తో ఫోటోగ్రఫీ అభిమానులకు ఇది బెస్ట్ ఫోన్. అదనంగా 120Hz LCD డిస్‌ప్లే, పంచ్ హోల్ కెమెరా డిజైన్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
Vivo T3x 5G - పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీ
ఈ ఫోన్ ధర రూ.12,499 నుండి ప్రారంభమవుతుంది. 6.72 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు దీన్ని స్ట్రాంగ్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్‌గా నిలబెట్టాయి.
Realme Narzo 70 Pro - కెమెరా ప్రీమియం క్వాలిటీ కావాలంటే ఇదే బెస్ట్
ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది: 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్. 16MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీ లవర్స్‌కి మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.18,499.
Redmi Note 14 Pro+ - హై-ఎండ్ లుక్, మల్టీ కెమెరా ఫ్లెక్సిబిలిటీ
Redmi Note సిరీస్ ఎప్పటిలాగే ఈ సారి కూడా అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. 50MP + 50MP + 8MP ట్రిపుల్ రెయర్ కెమెరా సెటప్, 20MP సెల్ఫీ కెమెరా, మొత్తం మీద ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది మంచి ఆప్షన్. ప్రస్తుతం రూ.17,999కే లభిస్తోంది.
Oppo F25 Pro 5G - సెల్ఫీ ఫ్యాన్స్‌కి పండగే..!
ఈ ఫోన్ హైలైట్ ఏమిటంటే, 32MP ఫ్రంట్ కెమెరా. ఇక వెనుక వైపున 64MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. స్టైలిష్ డిజైన్, 5G సపోర్ట్, పటిష్టమైన కెమెరా సెటప్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.19,999.
మార్కెట్ లో తక్కువ ధరకు ది బెస్ట్ కెమెరా ఫోన్లు కావాలంటే ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. పైన ఉన్న ఆప్షన్స్ లో కెమెరా క్వాలిటీ, ప్రాసెసింగ్ పవర్, స్క్రీన్ సైజ్, బ్యాటరీ బ్యాకప్‌లను బట్టి మీకు సరిపడే ఫోన్‌ను ఎంచుకోవచ్చు. పై ఫోన్లు అన్నీ మార్కెట్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.