/rtv/media/media_files/2025/10/03/sonam-wangchuk-2025-10-03-12-50-28.jpg)
కేంద్రపాలిత ప్రాంతం లడఖ్(Ladakh riots) కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇటీవల జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ నిరసనల వెనుక ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) కీలకంగా ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పాత్రపై కేంద్రం ఫోకస్ పెట్టింది.
సెప్టెంబర్ 24, బుధవారం నాడు లడఖ్ రాజధాని లేహ్‌లో వేలాది మంది ప్రజలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయడంతో పాటు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో నలుగురు నిరసనకారులు మరణించగా, 70 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం లేహ్‌లో కర్ఫ్యూ విధించి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
Also Read : తొక్కిసలాట ఘటన.. విజయ్‌కు మరో బిగ్ షాక్
వాంగ్‌చుక్ అరెస్ట్:
ఈ హింసాత్మక ఘటనలకు కేవలం 2 రోజుల తర్వాత, శుక్రవారం పోలీసులు సోనమ్ వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకున్నారు. లడఖ్‌లో హింసను ప్రేరేపించడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి వాంగ్‌చుక్ చేసిన ప్రకటనలే కారణమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆరోపించింది. 'అరబ్ స్ప్రింగ్' తరహా ఉద్యమాలు, 'నేపాల్ జెన్-జెడ్' ఆందోళనలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు యువతను రెచ్చగొట్టాయని కేంద్రం పేర్కొంది.
అరెస్ట్‌కు ముందు, వాంగ్‌చుక్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాను కేవలం శాంతియుతంగా లడఖ్ హక్కుల కోసం పోరాడుతున్నానని, తనను బలిపశువు చేయాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. అయితే, పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని, జాతీయ భద్రతా చట్టం (NSA) కింద కేసు నమోదు చేసి, జోధ్‌పూర్ జైలుకు తరలించారు. అంతేకాకుండా, ఆయన ఎన్‌జీవో (SECMOL)కి ఉన్న విదేశీ నిధుల (FCRA) లైసెన్స్‌ను కూడా కేంద్రం రద్దు చేసింది.
లడఖ్ సమస్యపై ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంతో, '3 ఇడియట్స్' సినిమాకు ప్రేరణగా నిలిచిన వాంగ్‌చుక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారారు. కేంద్ర ప్రభుత్వ ఆరోపణలను ఆయన మద్దతుదారులు ఖండిస్తున్నారు. లడఖ్ ప్రజల డిమాండ్లు, భద్రతకు సంబంధించిన ఈ వివాదంపై ఉద్రిక్తత కొనసాగుతోంది.
Also Read : 35ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వృద్ధుడి పెళ్లి.. తెల్లారే ఏం జరిగిందంటే?