/rtv/media/media_files/2025/04/07/JlqRzRo7vi5TJ54ZZDyu.jpg)
Madhya Pradesh Crime News
Madhya Pradesh Crime News: నేటి కాలంలో మానవ మృగాలు ఎక్కువయ్యారు. మహిళల భద్రతపై దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు అమలు చేసినా కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. చిన్నపెద్ద అనే తేడా లేకుండా మహిళలపై సామూహిక అత్యాచారం చేసి వారిని దారుణంగా చంపుతున్నారు. తాజా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖండవా జిల్లా దగ్గర మానవత్వాన్ని మంటగలిపే ఓ దారుణ కలకలం రేపింది. ఓ పెళ్లి వేడుకకు హాజరైన గిరిజన మహిళపై కొందరు నరరూప రాక్షసులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 45 ఏళ్ల ఆ మహిళను క్రూరంగా హింసించి, అతి పాశవికంగా ప్రవర్తించి ఆమె ప్రాణాలు తీశారు. ఈ ఘోరం దేశాన్ని ఒకప్పుడు కుదిపేసిన నిర్భయ సంఘటనను గుర్తు చేస్తోంది.
Also Read : జీతాలకు కూడా డబ్బుల్లేవ్.. చేతులెత్తేసిన యూనస్.. సంచలన ప్రకటన!
నరరూప రాక్షసుల చేతిలో..
ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం తాను ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు ఆమెను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లారు. అక్కడ ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. నరరూప రాక్షసులు తమ కామానలాన్ని తీరుస్తూ ఆమె ప్రైవేటు భాగాల్లో ఇనుపరాడ్డుతో హింసించడంతో తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా హింసించిన దృష్ట్యా ఆమె గర్భాశయం వెలుపలికి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆమె అపస్మారక స్థితిలో ఉండగా మరుసటి రోజు బంధువులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్రంగా రక్తస్రావం జరిగిన ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియా ప్రేమ కథ.. చివరికి ఏమైందంటే..?
ఆసుపత్రిలో ఆమె మృతిని నిర్ధారించిన వైద్యులు బాధితురాలి శరీరంపై కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించినట్లు స్పష్టంగా కనిపించాయని వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులువిచారణ ప్రారంభించి ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. IPCలోని సంబంధిత సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: రోజూ నీరు ఇలా తాగండి.. వయస్సు పెరిగే కొద్ది ఆరోగ్యం మీదే
Also Read : మేడ్చల్‌లో విషాదం.. కరెంట్ వైర్ ప్రమాదంలో యువతి మృతి, మరో వ్యక్తి ఆత్మహత్య
(telugu crime news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu)